జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద.. 36 గేట్లను ఎత్తిన అధికారులు

by Mahesh |
జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద.. 36 గేట్లను ఎత్తిన అధికారులు
X

దిశ, వెబ్ డెస్క్: కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా నది ఉరకలు వేస్తుంది. ముఖ్యంగా జూరాల ప్రాజెక్టు ఎగువ నుంచి భారీ వరద వచ్చి చేరుతుండటంతో అప్రమత్తమైన అధికారులు 36 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. కాగా ప్రస్తుతం జూరాల ప్రాజెక్టుకు 2.63 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా.. 36 గేట్ల ద్వారా.. 2.61 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 318.51 మీటర్లు కాగా.. ప్రస్తుతం 317.63 టీఎంసీల నీటి మట్టం ఉండగా.. 9.65 టీఎంసీల పూర్తి స్థాయి నీటి నిల్వకు గాను.. 7.89 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అయితే ఎగువ నుంచి ప్రాజెక్టుకు వస్తున్న వరద పై గంట గంటకు సమీక్ష నిర్వహిస్తున్న అధికారులు గేట్లను పైకి ఎత్తడం, తగ్గించడం చేస్తున్నారు. ముఖ్యంగా తుంగభద్ర డ్యామ్ గేటు కొట్టుకు పోయినప్పటి నుంచి అధికారులు అప్రమత్తంగా ఉంటున్నారు. ఎప్పటికప్పుడు వరదను అంచనా వేస్తూ.. దిగువన ఉన్న ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

Advertisement

Next Story