- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేడు బండి సంజయ్ బెయిల్ పిటిషన్‌పై విచారణ
దిశ, వెబ్‌డెస్క్: టెన్త్ పేపర్ లీక్ కేసులో అరెస్ట్ అయిన బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ జరగనుంది. ఇవాళ ఉదయం 10:30 గంటలకు బెయిల్ పిటిషన్ పై వరంగల్ కోర్టులో విచారణ జరగుతుంది. బండి సంజయ్ తరపున అడ్వకేట్ కరుణాసాగర్ వాదనలు వినిపించనున్నారు. రిమాండ్ కి సంబంధించిన పూర్తి ఆర్డర్ వచ్చిన తర్వాత హైకోర్టులో ఛాలెంజ్ చేస్తామని లాయర్ కరుణాసాగర్ చెప్పారు. మరో వైపు బండి సంజయ్ ను అరెస్ట్ చేసిన తీరు కరెక్ట్ కాదని బండి సోదరుడు బండి సంపత్ ఫైర్ అయ్యారు.
సంజయ్ హెల్త్ కండిషన్ తెలుసుకోకుండా ట్యాబ్లెట్స్ తీసుకోనియ్యకుండా ఇబ్బంది పెట్టారని పోలీసులపై మండి పడ్డారు. అర్ధరాత్రి అరెస్ట్ చేసి ఉదయం వరకు కారణం చెప్పకపోవడం ఏంటన్నారు. అయితే బండి సంజయ్ ని కలిసేందుకు కరీంనగర్ జైలు దగ్గర బండి సంజయ్ ని కలిసేందుకు కుటుంబ సభ్యులు తీవ్రంగా ప్రయత్నించారు. పర్మిషన్ లేకపోవడంతో వెనుతిరిగారు. లీగల్ గా ప్రొసిడై ఈ రోజు ఉదయం కలుస్తామని బండి సంజయ్ భార్య అపర్ణ, కుమారుడు భగీరథ్ తెలిపారు. పోలీసుల తీరుపై కుటుంబసభ్యులు మండిపడ్డారు.