- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం: బోయినపల్లి వినోద్ కుమార్
దిశ, తెలంగాణ బ్యూరో : ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాలని, ఆరోగ్య తెలంగాణ కోసం వైద్యులు కృషి చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ కోరారు. ఆదివారం కోఠిలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భవన సముదాయంలో ఏర్పాటు చేసిన తెలంగాణ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ ( తానా ) కార్యాలయాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం వైద్య రంగానికి పెద్దపీట వేస్తుందని, అందులో భాగంగానే ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ మంజూరు చేసిందన్నారు.
వైద్య, ఆరోగ్యం, విద్య ప్రభుత్వ ప్రధాన అజెండా అని, ఆ దిశలోనే ప్రభుత్వం ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో తానా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వి రాకేష్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎం.వి. ప్రసాద్, వైస్ చైర్మన్ డాక్టర్ సి.హెచ్. జగన్ మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.
Also Read..
.హరిత విప్లవ స్ఫూర్తి డాక్టర్ బీఆర్ అంబేద్కర్.. ఎంపీ సంతోష్ కుమార్