Somesh Kumar: ఆయన సీఎస్ కాదు.. కల్వకుంట్ల ఫ్యామిలీకి నమ్మిన బంటు.. టి.కాంగ్రెస్ సెటైర్

by Ramesh Goud |
Somesh Kumar: ఆయన సీఎస్ కాదు.. కల్వకుంట్ల ఫ్యామిలీకి నమ్మిన బంటు.. టి.కాంగ్రెస్ సెటైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆయన సీఎస్ కాదు.. కల్వకుంట్ల ఫ్యామిలీకి నమ్మిన బంటు అని తెలంగాణ మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ పై తెలంగాణ కాంగ్రెస్ సెటైర్ వేసింది. జీఎస్టీ కుంభకోణంలో సోమేశ్ కుమార్ పై కేసు, వాణిజ్య పన్నుల శాఖ ఫిర్యాదుతో సీసీఎస్ లో నమోదు, ఎఫ్ఐఆర్ లో ఐదో నిందితుడిగా పేరు అంటూ ఓ వార్త పత్రికలో వచ్చిన కథనాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై పలు విమర్శలు చేసింది. ఈ సందర్భంగా.. ఆయన ఆ నాటి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనే కంటే.. కల్వకుంట్ల ఫ్యామిలీకి నమ్మిన బంటు అనడం కరెక్ట్ అని ఎద్దేవా చేసింది. అలాగే ప్రజా ధనానికి కస్టోడియన్ గా ఉండాల్సిన ఈయన ప్రజాధనం దోపిడీకి మార్గదర్శిగా మారాడు అని ఫైర్ అయ్యింది. జీఎస్టీ వసూళ్లలో ఏకంగా రూ.1000 కోట్ల గోల్ మాల్ స్కాం తాజాగా బట్టబయలైంది అని చెబుతూ.. తెలంగాణలో గడచిన పదేళ్లూ “స్కామిలీ” పాలన జరిగిందనడానికి ఇది మరో నిదర్శనం అని టి కాంగ్రెస్ ఎక్స్ ద్వారా ఆరోపణలు చేసింది.

Advertisement

Next Story

Most Viewed