- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TGNPDCL: హ్యాట్సాఫ్ సార్.. విద్యుత్ అధికారులపై రైతుల సంతోషం.. ఎందుకంటే?
దిశ, డైనమిక్ బ్యూరో: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాజెక్టు, ఖమ్మం జిల్లా అశ్వరావుపేట మండలంలోని పెద్దవాగు ప్రాజెక్టుకు గండి పడిన విషయం తెలిసిందే. దీంతో దాని సమీపంలోని గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంట, ఆస్తి నష్టం కూడా భారీగా జరిగింది. ఆస్తి, పంట నష్టపోయిన వారికి అండగా ఉంటామని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అయితే, పెద్దవాగు ప్రాజెక్టు తెగిపోవడంతో విద్యుత్ లైన్లు దెబ్బతిన్నాయి.
భద్రాద్రి కొత్తగూడెంలోని దమ్మపేట మండలం గుమ్మడివల్లి, నందిపాడు, కోయరంగాపురంలో గత రెండు రోజులుగా టీజీఎన్‌పీసీఎల్ అధికారులు, సిబ్బంది పగలు రాత్రి విశ్రాంతి లేకుండా శ్రమించి 29 గిరిజన ఆవాసాలకు యుద్దప్రాతిపదికన విద్యుత్ సరఫరా పునరుద్ధరణ చేయడం జరిగింది.ఇందుకు గాను రైతులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, ఆనందాన్ని వెలిబుచ్చారు. దీనికి సంబంధించిన వీడియో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. హ్యాట్సాఫ్ సార్.. రాత్రి 11 గంటలు అవుతున్నా కూడా విద్యుత్ అధికారులు కష్టపడి పనిచేశారని స్థానిక రైతులు విద్యుత్ అధికారులతో తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.