- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Harish Rao : ఆర్థికాభివృద్ధిని దాయడం సరికాదు.. ఎక్స్‌లో హరీష్‌రావు ఆసక్తికర పోస్ట్
దిశ, డైనమిక్ బ్యూరో: ఆర్థికాభివృద్ధిని దాయడం సరికాదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్‌రావు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన శనివారం ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఉద్యమ స్ఫూర్తితో రాష్ట్రాన్ని ఆర్థికంగా దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దామని, అయితే ఆ పరిస్థితిని కాంగ్రెస్ మసిపూసి మారేడుకాయ చేస్తూ దృష్ప్రచారం చేసి ఎన్నికల్లో లబ్ధి పొందిందని విమర్శించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా బీఆర్ఎస్ పాలనపై అబద్ధపు ప్రచారం మానలేదని ఆరోపించారు.
తాజాగా 16వ ఆర్థిక సంఘం ముందు తెలంగాణ ఆర్థిక పరిస్థితి పై ఉంచిన వివరాలు ఇందుకు అద్దం పడుతున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ తమ ప్రభుత్వ వైఫల్యాలను, ఎన్నికల సమయంలో ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేయలేని దుస్థితిని కప్పిపుచ్చుకునేందుకు, తమ అసమర్థ పాలన నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఇలాంటి ప్రచారానికి దిగిందన్నారు. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు తస్మాత్ జాగ్రత్త.. అంటూ పోస్ట్ చేశారు.