- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీలోకి హరీశ్ రావు..మంత్రి కోమటి రెడ్డి సంచలన వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో:మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వర్సెస్ మాజీ మంత్రి హరీశ్ రావు మధ్య డైలాగ్ వార్ కాకపుట్టిస్తోంది. ఒకటవ తేదీనే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లిచడంపై నిన్న హరీశ్ రావుపై విమర్శలు గుప్పించిన కోమటిరెడ్డి.. తాజాగా శనివారం మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫ్లోర్ లీడర్ పదవి ఇవ్వకపోతే హరీశ్ రావు కూడా బీజేపీలోకి వెళ్తాడని నెన్సేషనల్ కామెంట్ చేశారు. శనివారం మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన కోమటిరెడ్డి.. కేటీఆర్ ఇప్పటికీ తండ్రి కేసీఆర్ చాటు కొడుకే అని సెటైర్ వేశారు. కేటీఆర్ మాదిరిగా తండ్రి పేరుతో నేను రాజకీయాల్లోకి రాలేదని ఉద్యమాలు చేసి వచ్చానన్నారు. మేం జీరో బిల్ ఇచ్చినట్లుగా కేటీఆర్ కి జీరో నాలెడ్జ్ ఉందన్నారు. నాలెడ్జ్ లేని కేటీఆర్ గురించి మాట్లాడటం వృథా అని, కాళేశ్వరం కట్టించిన చీఫ్ డిజైనర్ కేసీఆర్ మేడిగడ్డకు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు.
భువనగిరి నుంచి రాహుల్ గాంధీ పోటీ:
ఎంపీ అభ్యర్థులపై అంతర్గత సర్వే జరుగుతోందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. భువనగిరి నుంచి పోటీ చేయాలని రాహుల్ గాంధీని కోరానని చెప్పారు. భువనగిరి, ఖమ్మం, నల్గొండలో దక్షిణాదిలో టాప్ మెజార్టీ వస్తుందని ఈసారీ మోడీ కంటే రాహుల్ గాంధీనే ఎక్కువ మెజార్టీతో గెలవబోతున్నారని జోస్యం చెప్పారు.
యాదగిరిగుట్టగా మారుస్తూ త్వరలో జీవో:
యాదాద్రిని ఇకపై యాదగిరిగుట్టగా మారుస్తామని కోమటిరెడ్డి అన్నారు. యాదాద్రిని యాదగిరి గుట్టగా మారుస్తూ త్వరలోనే జీవో విడుదల చేస్తామని చెప్పారు.