చిట్టి‌ నిర్వాహకుల వేధింపులు.. యువకుడు ఆత్మహత్య

by Sathputhe Rajesh |
చిట్టి‌ నిర్వాహకుల వేధింపులు.. యువకుడు ఆత్మహత్య
X

దిశ, నిజామాబాద్ క్రైo: చిట్టిల నిర్వాహకుల వేధింపులకు యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగు చూసింది. నిజామాబాద్ నగరంలోని రెండో టౌన్ పరిధిలో గల శివాజీ నగర్ ఐటిఐ ప్రాంతంలో గణేష్ (24) అనే యువకుడు తన ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మున్సిపాలిటీలో ఔట్సోర్సింగ్ లేబర్‌గా పగటిపూట, సాయంత్రం వేళ ఒక ప్రైవేట్ హాస్పిటల్‌లో అటెండర్‌గా పనిచేసే గణేష్ తన అవసరాల నిమిత్తం అపర్ణ, లత అనే మహిళల వద్ద చిట్టిలను వేస్తున్నట్టు తెలిసింది.

రూ.25 వెల చిట్టీలకు సంబంధించి డబ్బులు తీసుకున్న గణేష్ డబ్బులు చెల్లింపులు ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. రెండు రోజుల క్రితం గణేష్ పనిచేస్తున్న ప్రైవేట్ హాస్పటల్ వద్ద అపర్ణ, లత మహిళలు గొడవ చేసినట్టు తెలిసింది. దాంతో మనస్థాపానికి గురైన గణేష్ తన ఆత్మహత్యకు లతా, అపర్ణలు కారణమని సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాధితుని తల్లి రేఖ రెండో టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్టు 2 వ టౌన్ ఎస్సై పూర్నేశ్వర్ తెలిపారు.

Advertisement

Next Story