రాజారిత్విక్ మనవాడు కావడం ఆనందంగా ఉంది!.. సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ట్వీట్

by Ramesh Goud |
రాజారిత్విక్ మనవాడు కావడం ఆనందంగా ఉంది!.. సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణకు చెందిన రాజారిత్విక్ ఇంటర్నేషనల్ చెస్ చాంపియన్ షిప్ లో రజత పథకం గెలుచుకున్నాడని, అతడికి అభినందనలు తెలియజేస్తూ.. సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ట్వీట్ చేశారు. ఫ్రాన్స్ లో జరుగుతున్న ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెంట్ లో రిత్విక్ సిల్వర్ మెడల్ సాధించాడని ఓ ప్రముఖ డిజిటల్ మీడియా ప్రచురించిన కధనాన్ని ట్వి్ట్టర్ లో పోస్ట్ చేసిన రేవంత్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఫ్రాన్స్‌లో జరిగిన లాప్లాగ్నే ఇంటర్నేషనల్ చెస్ ఛాంపియన్‌ షిప్‌ లో తొమ్మిది రౌండ్లలో ఏడు పాయింట్లు సాధించి రజత పతకాన్ని గెలుపొందిన రాజరిత్విక్ మన స్వంత యువ చెస్ స్టార్ అవ్వడం ఆనందంగా ఉందన్నారు. అలాగే పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన గ్రాండ్‌మాస్టర్ రాజా రిత్విక్‌కి అభినందనలు తెలియజేశారు. ఇక అతను టోర్నీలో అజేయంగా నిలిచాడని, ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను కేవలం ఆఫ్ పాయింట్‌తో కోల్పోయాడని అన్నారు. అతడు ఇకముందు మరింతగా రాణించాలని కోరుకుంటూ, అతని ముందున్న ప్రయాణంలో అన్ని విధాల సహాయ సహాకారాలు అందిస్తామని హామీ ఇస్తున్నానని సీఎం ఎక్స్ వేదికగా వెల్లడించారు.



Next Story