- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
GST Collections: పెరిగిన జీఎస్టీ వసూళ్లు.. గతేడాది కంటే 10 శాతం హైక్
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో డిసెంబర్ నెలలో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు అత్యధికంగా పెరిగాయి. గతేడాది డిసెంబర్ కంటే రూ.471 కోట్లు అధికంగా వసూళ్లయ్యాయి. 2023తో పోలిస్తే గత ఆరు నెలల్లో రూ.1,277 కోట్లు ఎక్కువ వసూళ్లయ్యాయని అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ప్రజల కొనుగోలు శక్తి సామర్థ్యాలు పెరగడంతో పాటు హైదరాబాద్ మార్కెట్ ఎక్కడా తగ్గలేదని జీఎస్టీ వసూళ్ల లెక్కలు చెబుతున్నాయి. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోయిందని, ప్రజల ఆర్థిక శక్తి తగ్గిందని, రియల్ ఎస్టేట్పై పరోక్షంగా ఆధారపడిన వారి జీవనం కష్టంగా మారిందని, రకరకాలుగా చేస్తున్న ప్రచారం తప్పని ఈ లెక్కలు తేల్చాయి. గత నెలలో కాగ్ ప్రకటించిన లెక్కల ప్రకారం రిజిస్ట్రేషన్ ఆదాయం ఎక్కడా పడిపోలేదని స్పష్టమైంది. సెప్టెంబర్ నెలలోనూ అత్యధిక వసూళ్లు జరిగాయి. 2023లో రూ.5,226 కోట్లు ఉండగా, 2024లో రూ.5,267 కోట్ల ఇన్‌కమ్ వచ్చింది. ఆ తర్వాతి నెలల్లో అంతగా ఆదాయం రాలేదు. అయితే, దేశవ్యాప్తంగా జీఎస్టీ ఆదాయం పెరుగుతూ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ జీఎస్టీ వసూళ్లు 6 శాతం తగ్గాయి. కర్ణాటకలో 7 శాతం పెరగ్గా, తమిళనాడులో 11 శాతం, కేరళలో 5 శాతం జీఎస్టీ ఆదాయం పెరిగింది. దక్షణాది రాష్ట్రాల్లో జీఎస్టీ వసూళ్లు పెరిగిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది.
తెలంగాణలో జీఎస్టీ వసూళ్ల వివరాలు రూ.కోట్లలో
నెల - 2023 - 2024 -పెరిగిన మొత్తం
డిసెంబర్ - 4,753 - 5,224 - 471
నవంబర్ - 4,986 - 5,141 - 155
అక్టోబరు - 4,868 - 5,211 - 343
సెప్టెంబర్ - 5,226 - 5,267 - 41
ఆగస్టు - 4,393 - 4,569 - 176
జూలై - 4,849 - 4,940 - 91