- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దిశ ఎఫెక్ట్...భూ కబ్జా, నిర్మాణాల పరిశీలన
దిశ, తంగళ్లపల్లి : దిశ కథనానికి స్పందన లభించింది. శనివారం దిశ దినపత్రికలో ప్రచురితమైన భూ కబ్జాలు.. అక్రమ నిర్మాణాలు అనే కథనానికి మండల రెవెన్యూ అధికార యంత్రాంగం కదిలింది. మండలంలోని సారంపల్లి గ్రామంలో 464 సర్వే నెంబరులో గవర్నమెంట్ నిర్మాణాలకు కేటాయించిన భూమి కబ్జాకు గురై, అందులో నిర్మించిన కట్టడాలను ఎమ్మార్వో జయంత్ తన రెవెన్యూ సిబ్బందితో కలిసి పరిశీలించారు.
వివరాలు సేకరించారు. తమ పరిశీలనలో సేకరించిన వివరాల ప్రకారం సదరు భూములు పట్టాదారులకు చెందినవా.. లేక ఆ భూములకు సంబంధం లేని వారు ఎవరైనా ఆక్రమించారా.. అనేది రికార్డుల ద్వారా గుర్తిస్తామని తెలిపారు. విచారణ నివేదికను ఉన్నతాధికారులకు, ప్రభుత్వానికి నివేదించిన అనంతరం వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ జయంత్ స్పష్టం చేశారు. కాగా భూ కబ్జాలు అక్రమ కట్టడాల వ్యవహారం తంగళ్లపల్లి మండలంతోపాటు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.