Cipla: ఆస్తమాను గుర్తించేందుకు వీలుగా మొబైల్ యాప్‌ను ప్రారంభించిన సిప్లా

by S Gopi |
Cipla: ఆస్తమాను గుర్తించేందుకు వీలుగా మొబైల్ యాప్‌ను ప్రారంభించిన సిప్లా
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఫార్మా దిగ్గజం సిప్లా దేశంలో ఆస్తమా(ఉబ్బసం) లైన్ స్క్రీనింగ్‌ను సులభతరం చేయడానికి మొబైల్ అప్లికేషన్ సిప్ఎయిఎయిర్‌ను ప్రారంభించినట్లు సోమవారం ప్రకటించింది. ఈ యాప్ ద్వారా వినియోగదారులు తమకు ఉబ్బసం వచ్చే అవకాశాలను గుర్తించవచ్చు, ప్రాథమిక దశలోనే దాన్ని కనుగొనే వీలుంటుందని కంపెనీ వెల్లడించింది. దీనివల్ల సరైన సమయంలో ఆస్తమాను గుర్తించి, తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చని కంపెనీ అధికారిక పత్రికా ప్రకటనలో తెలిపింది. గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ నివేదిక ప్రకారం.. దేశంలో 3.43 కోట్ల మది ఆస్తమాతో ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా దేశంలో ఆస్తమా మరణాల రేటు మూడు రెట్లు అధికంగా ఉందని, ప్రపంచ సగటు కంటే రెండింతలు ఆస్తమా సంబంధిత వైకల్యం ఉన్నట్టు వెల్లడించింది. దీనికి పరిష్కారంగానే సిప్ఎయిర్ యాప్ తీసుకొచ్చామని కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతం ఇది ఆండ్రాయిడ్‌లో అందుబాటులో ఉండగా, త్వరలో ఐఓఎస్ డివైజ్‌లలోనూ తీసుకురానున్నట్టు స్పష్టం చేసింది.

సిప్ఎయిర్ యాప్ ఎలా పనిచేస్తుందంటే..

ఈ యాప్‌లో స్క్రీన్‌పై కనిపించే వర్చువల్ క్యాండిల్‌ను కస్టమర్లు ఆర్పివేసే తీరులో గాలిని ఊదాలి. దీని ద్వారా యాప్ గాలి ఊదే నాణ్యతను పరీక్షించి, ఆస్తమాను సూచించే నమూనాలను గుర్తించి, ఉచ్ఛ్వాస శబ్దాలను విశ్లేషిస్తుంది. దాన్ని బట్టి టెస్టింగ్ ఫలితాలు రెడ్, ఎల్లో, గ్రీన్ విభాగాలుగా డిస్‌ప్లే అవుతాయి. తద్వారా కస్టమర్లు తమ ఆస్తమా వ్యాధి గురించి ఒక నిర్ధారణకు వస్తారు. అంతేకాకుండా ఈ యాప్ వినియోగదారుల టెస్టింగ్ ఫలితాల ఆధారంగా ఆరోగ్యకరమైన జీవనశైలిని సూచిస్తుందని సిప్లా పేర్కొంది.

Advertisement

Next Story