Sheikh Hasina : షేక్ హసీనాపై మరో అరెస్ట్ వారెంట్ జారీ చేసిన బంగ్లాదేశ్

by M.Rajitha |
Sheikh Hasina : షేక్ హసీనాపై మరో అరెస్ట్ వారెంట్ జారీ చేసిన బంగ్లాదేశ్
X

దిశ, వెబ్ డెస్క్ : బంగ్లాదేశ్‌(Bangladesh) అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్‌(ICT) ఆ దేశ మాజీ ప్రధాని షేక్‌ హసీనా(Sheikh Hasina)పై మరోసారి అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసింది. మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడినందుకు గానూ ఆమెతో పాటు మరో 12 మందికి ఈ వారెంట్‌ జారీ చేసింది. హసీనా రక్షణ సలహాదారు మేజర్‌ జనరల్‌ (రిటైర్డ్‌) తారిక్‌ అహ్మద్‌ సిద్ధిఖీ, మాజీ ఐజీ బెనజీర్‌ అహ్మద్‌, మాజీ నేషనల్‌ టెలికమ్యూనికేషన్‌ మానిటరింగ్‌ సెంటర్‌ డీజీ జియావుల్‌ అహ్‌సాన్‌ వంటి వారు కూడా ఈ జాబితాలో ఉన్నారు. వీరందరినీ ఫిబ్రవరి 12వ తేదీలోపు కోర్టు ఎదుట ప్రవేశపెట్టాలని ఆదేశించింది. కాగా, హసీనా దేశం విడిచి భారత్‌కు వెళ్లిపోయిన నాటి నుంచి ఆమెపై జారీ అయిన రెండో వారెంట్‌ ఇది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు ఉధృతం కావడంతో ఆగస్టు 5న హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్‌కు పారిపోయి వచ్చిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story