ప్రతి వ్యక్తి జీవితంలో సైన్స్ చాలా అవసరం

by Naveena |
ప్రతి వ్యక్తి జీవితంలో సైన్స్ చాలా అవసరం
X

దిశ, నారాయణపేట ప్రతినిధి : ప్రతి వ్యక్తి జీవితంలో సైన్స్ చాలా అవసరమని, పాఠశాల స్థాయి నుండి వినూత్న ఆలోచనలు కలిగి ఉండాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని శ్రీ చిట్టెం నర్సిరెడ్డి మెమోరియల్ డిగ్రీ కళాశాల ఆవరణలో జిల్లా విద్యా వైజ్ఞానిక ఉత్సవం జరిగింది. రెండవ రోజు శనివారం నాడు ముగింపు కార్యక్రమంలో భాగంగా ఆమె మాట్లాడుతూ..నేను చూసిన చాలా ప్రదర్శనలు చాలా బాగున్నాయని,చక్కటి ప్రదర్శనతో పాటు అర్థమయ్యే విధంగా వివరించారని కొనియాడారు. పరుగెడుతున్న ప్రపంచాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేయాలని వారికి సూచించారు. సైన్స్ ఒక్కటే కాకుండా అన్ని విషయాలలో ప్రావీణ్యం సంపాదించాలని కోరారు. పాఠశాల గది నుండి సాధన చేయాలని, అందుకు ఉపాద్యాయులు వారిని అన్ని విషయాలలో తీర్చి దిద్దాలని పేర్కొన్నారు. రాబోయే రోజులలో ఇంకా చాలా ప్రదర్శనలతో రావాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఎక్కువ మొత్తంలో పాల్గొని చక్కటి ప్రదర్శనలు ఇవ్వడం ఎంతో అభినందనియమన్నారు. రాబోయే రోజులలో వినూత్న ఆలోచనలతో ముందుకు రావాలని కొనియాడారు. విద్యార్థుల వినూత్న ఆలోచనలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. సైన్స్ ఒక అద్భుతమైనదన్నారు. విద్యార్థులను భావి భారత పౌరులుగా తయారు చేయడానికి ఉపాద్యాయులు కృషి చేయాలని కోరారు. అనంతరం గెలుపొందిన వారికి బహుమతులను ప్రధానం చేశారు. విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు తిలకించడానికి జిల్లా నలుమూలల నుండి 8000 వేల మంది విద్యార్థులు రావడం జరిగింది. అంతకు ముందు విద్యార్థులు ప్రదర్శనలు చూడటానికి బారులు తీరి వీక్షించారు. నియమించిన కమిటీలు వారి వారి బాధ్యతలు అలుపెరుగని రీతిలో చక్కగా నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చూపరులను ఆకట్టుకున్నాయి. ఆయా శాఖ అధికారులు గోవింద రాజులు, యోగానంద్, భాను ప్రకాష్, కనకప్ప, యాదయ్య శెట్టి, పిఆర్టియు జిల్లా అధ్యక్షులు జనార్దన్ రెడ్డి, తపస్ జిల్లా అధ్యక్షులు షేర్ కృష్ణారెడ్డి, పిడీలు శ్రీధర్, మౌలాలి, వెంకటేష్ ,వేణు, రాజశేఖర్, కతలప్ప, రాజేష్, బాలరాజ్, సాయినాథ్, మాధవి, పర్వీన్, కృష్ణవేణి, పారిజాత, రాజేశ్వరి, అనంత సేన, అక్తర్ పాషా, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Next Story