ఒక హీరోను ద్వేషించడం మాకు తెలియదు.. పవన్ కల్యాణ్ హాట్ కామెంట్స్

by Gantepaka Srikanth |   ( Updated:2025-01-04 16:25:01.0  )
ఒక హీరోను ద్వేషించడం మాకు తెలియదు.. పవన్ కల్యాణ్ హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: గేమ్ ఛేంజర్(Game Changer) సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్‌లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమా టికెట్ల రేట్ల కోసం హీరోలు ప్రభుత్వాల వద్దకు రావాల్సిన పనిలేదు.. నిర్మాతలు వస్తే సరిపోతుంది అని అన్నారు. హీరోలు వచ్చి మాకు వంగి వంగి నమస్కారాలు పెట్టాల్సిన అవసరం లేదని.. తమది అల పెట్టించుకునే మనస్తత్వం కాదని అన్నారు. చిత్ర పరిశ్రమకు రాజకీయాలు పూయడం తమకు ఇష్టం లేదని తెలిపారు. ఒకరిని ద్వేషించడం తమకు తెలియదని.. అందరు బాగుండాలని కోరుకునే వ్యక్తులం అని అన్నారు. సినిమా తీసేవారు మాత్రమే సినిమాల గురించి మాట్లాడాలి.. రాజకీయాలు చేసేవారు సినిమాల గురించి మాట్లాడొద్దు అని హాట్ కామెంట్స్ చేశారు.

గత ప్రభుత్వం భీమ్లా నాయక్ సినిమాకు టికెట్ల ధరలు పెంచుకునే అవకాశం ఇవ్వకపోగా.. తగ్గించిందని గుర్తుచేశారు. కానీ ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం ఏ హీరో సినిమాపై విపక్ష చూపించదు అని హామీ ఇచ్చారు. సినిమా టికెట్ల పెంపు మీద కూడా వివాదం అవసరం లేదని.. అది ప్రభుత్వానికి ఆదాయం తెచ్చి పెడుతుందని చెప్పారు. డిమాండ్, సప్లై ఆధారంగానే టికెట్ల ధరల పెంపు ఉంటుందని అన్నారు. టికెట్ల ధరల పెంపుతో జీఎస్టీ రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని చెప్పారు. కాగా, రామ్ చరణ్(Ram Charan) ప్రధాన పాత్రలో నటించిన గేమ్ ఛేంజర్ సినిమా సంక్రాంతి కానుకగా ఈనెల 10వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదల కాబోతోంది. దిగ్గజ దర్శకులు శంకర్ తెరకెక్కించిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు. కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటించగా.. శ్రీకాంత్, ఎస్‌జే సూర్య, సునీల్ కీలక పాత్రలు పోషించారు.

Advertisement

Next Story