TTD News : వైకుంఠ ఏకాదశికి టీటీడీ భారీ ఏర్పాట్లు

by M.Rajitha |
TTD News : వైకుంఠ ఏకాదశికి టీటీడీ భారీ ఏర్పాట్లు
X

దిశ, వెబ్ డెస్క్ : వైకుంఠ ఏకాదశి(Vaikunta Ekadashi) నేపథ్యంలో భక్తులు ప్రశాంతంగా తిరుమల శ్రీవారి(Tirumala Srivaru)ని దర్శించుకునేలా టీటీడీ(TTD) పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. 2025 జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా టీటీడీ అధికారులు, మునిసిపల్ అధికారులు, పోలీసు అధికారులతో కలిసి శనివారం రామచంద్ర పుష్కరిణి వద్ద జరుగుతున్న ఏర్పాట్లను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు(TTD Chairman BR Naidu) పరిశీలించారు.10 రోజుల పాటు భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసేందుకు వీలుగా పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. తిరుపతిలోని 8 కేంద్రాలలో 90 కౌంటర్లు, తిరుమలలో 4 కౌంటర్లు కలుపుకుని మొత్తం 94 కౌంటర్లలో టోకెన్లు మంజూరు చేస్తారన్నారు. తిరుపతిలో భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లు, బారికేడ్లు, షెడ్లు, భద్రత, తాగునీరు, మరుగుదొడ్లు తదితర పటిష్ట చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

Advertisement

Next Story