TG: తెలంగాణ రైతులకు CM రేవంత్ రెడ్డి భారీ శుభవార్త

by Gantepaka Srikanth |   ( Updated:2025-01-04 16:20:50.0  )
TG: తెలంగాణ రైతులకు CM రేవంత్ రెడ్డి భారీ శుభవార్త
X

దిశ, వెబ్‌డెస్క్: జనవరి 26వ తేదీ నుంచి పథకాలన్నీ అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) స్పష్టం చేశారు. శనివారం కేబినెట్(Telangana Cabinet) భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు. వ్యవసాయయోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా(Rythu Bharosa) ఇస్తామని ప్రకటన చేశారు. ప్రతి ఎకరాకు రూ.12 వేలు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని స్పష్టం చేశారు. భూమిలేని వ్యవసాయ కుటుంబాలకు కూడా ఏటా రూ.12 వేలు ఇవ్వబోతున్నట్లు చెప్పారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా(Indiramma Housing Scheme) కింద పథకం అమలు చేయబోతున్నట్లు తెలిపారు. రేషన్ కార్డు(Ration cards) లేని వారికి సంక్రాంతి నుంచి రేషన్ కార్డులు కూడా మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. రైతు భరోసాలో ఎలాంటి సీలింగ్ లేదని అన్నారు. ప్రభుత్వం సేకరించిన భూములకు రైతు భరోసా ఉండదని స్పష్టం చేశారు.

కేబినెట్ నిర్ణయాలు

= సంక్రాంతి కానుకగా రైతుభరోసా అమలు

= పంచాయతీరాజ్‌లో 508 కారుణ్య నియామకాలు

= కొత్త గ్రామ పంచాయతీలకు గ్రీన్ సిగ్నల్

= ఫిబ్రవరి నుంచి సన్నబియ్యం పంపిణీ

= తెలంగాణ టూరిజం పాలసీకి కేబినెట్ ఆమోదం

= సంక్రాంతి నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ

Advertisement

Next Story