- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బాలికల బాత్రూంలో కెమెరా ఏర్పాటు చేసిన విద్యార్థి
దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల బాలికల టాయిలెట్స్ లో ఓ విద్యార్థి సెల్ ఫోన్ కెమెరా ఏర్పాటు చేసి రికార్డు చేసిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. వివరాలలోకి వెళితే.. కళాశాలలో తృతీయ సంవత్సరం చదువుతున్న కరీంనగర్ కి చెందిన ఎన్.సిద్ధార్థ బాలికల టాయిలెట్స్ లో తన సెల్ ఫోన్ కెమెరాను ఆన్ చేసి ఉంచాడు. దాదాపుగా గంటన్నర తర్వాత ఒక విద్యార్థిని ఆ సెల్ ఫోన్ ను గుర్తించి కళాశాల అధ్యాపకుల దృష్టికి తీసుకెళ్ళింది.పరువు పోతుందని భావించి ఈ సంఘటనను వెలుగులోకి రాకుండా అధ్యాపకులు ప్రయత్నాలు చేసినట్లు తెలిసింది.ఈ లోపు సమాచారం అందుకున్న విద్యార్థి సంఘాల నాయకులు,సభ్యులు పెద్ద ఎత్తున పాలిటెక్నిక్ కళాశాలకు చేరుకొని ఆందోళన చేపట్టారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారిందని సమాచారం అందుకున్న ఎస్పీ జానకి ఆదేశాలతో డిఎస్పీ వెంకటేశ్వర్లు,వన్ టౌన్ సీఐ అప్పయ్య పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకొని.విద్యార్థి సిద్ధార్థ ను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు.కాగా ఈ సంఘటన ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చర్చాశనీయ అంశంగా మారింది.