నగరంలో ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్ నెట్స్! వాహనదారులకు కాస్త రిలాక్స్

by Ramesh N |   ( Updated:2024-05-19 11:24:10.0  )
నగరంలో ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్ నెట్స్! వాహనదారులకు కాస్త రిలాక్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: భగభగ మండే ఎండలో వాహనాలు నడపాలంటే ఎవరికైన చిరాకు వస్తుంది. ముఖ్యంగా మిట్ట మధ్యాహ్నం ఎండకు ఎండుతూ.. ట్రాఫిక్ సిగ్నల్స్‌ వద్ద 4 నుంచి 5 నిమిషాల పాటు నిరీక్షించాల్సి రావడంతో ద్విచక్ర వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అయితే ఎండ వేడిమి నుంచి ఉపశమనం కల్పించేందుకు సిగ్నల్స్ వద్ద ‘గ్రీన్ నెట్స్’(గ్రీన్ షాడో క్లాత్) ఏర్పాటు చేశారు. దీనికి సబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

నగరంలోని హిమాయత్‌నగర్ లిబర్టీ సిగ్నల్ వద్ద, మరొకటి ప్యాట్నీ సెంటర్ వద్ద గ్రీన్ నెట్స్ ఏర్పాటు చేశారు. అయితే ఎండాకాలం పోయి వర్షాకాలం వస్తుంటే ఇప్పుడు ఏర్పాటు చేసి ఏం లాభం అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎండ నుంచి కాస్త రిలాక్స్ ఉంటుందని పలువురు గ్రీన్ నెట్స్ ఏర్పాటు చేసినందుకు ప్రశంసిస్తున్నారు. కాగా, ఇటీవల పుదుచ్చేరిలోని పలు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ప్రజా సంఘాల కార్యకర్తలు గ్రీన్ నెట్స్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story