- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ మేనిఫెస్టోకు సూపర్ రెస్పాన్స్.. పవర్ ఖాయమంటూ హస్తం నేతల ధీమా..!
దిశ, తెలంగాణ బ్యూరో: ‘అభయ హస్తం’ పేరిట కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. 37 ప్రధాన అంశాలతో 66 హామీలను పొందుపరిచింది. దాదాపు అన్ని వర్గాలను కవర్ చేస్తూ మేనిఫెస్టోను రూపొదించినట్లు పార్టీ వర్గాలు విశ్వసిస్తున్నాయి. ఇటీవల విడుదల చేసిన ఆరు గ్యారంటీలతో పాటు డిక్లరేషన్ల నుంచి ప్రధాన హామీలను మేనిఫెస్టోలో పెట్టారు. నిరుద్యోగులు, విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు, రైతులు, మహిళలు, వికలాంగులు, కుల సంఘాలు, అసంఘటిత కార్మికులు, జర్నలిస్టులు, యువత, ఇలా అన్ని వర్గాలను సమన్వయం చేస్తూ పార్టీ హామీలు ఇచ్చిందని నేతలు ప్రచారం చేస్తున్నారు. దీంతో పాటు సంక్షేమానికి కూడా పెద్దపీఠ వేసింది. ప్రజల నుంచీ అద్భుతమైన స్పందన వస్తున్నట్లు కాంగ్రెస్ చెబుతున్నది. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు బీజేపీ, బీఆర్ఎస్‌లు ఊహించని విధంగా కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో అంశాలను పెట్టి అందరికీ షాక్ ఇచ్చిందని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఈ అభయ హస్తం మేనిఫెస్టో ద్వారానే కాంగ్రెస్ పవర్‌లోకి వస్తుందని ఆ పార్టీ నాయకులు ఆశాజనకంగా ఉండటం గమనార్హం.
ప్రస్తుత బీఆర్ఎస్ సర్కార్ పాలనలో సీఎం అధికారిక కార్యాలయంలో తనను కలిసే అవకాశం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ పవర్‌లోకి రాగానే వైఎస్సార్ తరహాలో ‘ప్రజాదర్బార్’ నిర్వహిస్తుందని మేనిఫెస్టోలో పొందుపరిచింది. ఇది ప్రజలకు, ప్రభుత్వానికి సన్నిహిత్యాన్ని పెంచే చాన్స్ ఉంటుంది. అంతేగాక ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబరును ఏర్పాటు చేయనున్నారు. ఇక ఇప్పటికే ఆరు గ్యారంటీలపై ప్రజల్లో అద్బుతమైన స్పందన ఉన్నది. ప్రధానంగా మహిళలకు ప్రతీనెల రూ.2,500, ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ వంటివి పాపులర్ అయ్యాయి. అంతేగాక రాజీవ్ ఆర్యోగ్య శ్రీ బీమాను రూ.10లక్షలకు పెంపుతో ఎంతో మంది పేదలకు మేలు జరగనున్నది.
దీంతో పాటు రూ.2లక్షల రుణమాఫీ, మద్దతు ధర, భూ మాత పోర్టల్, అమర వీరుల కుటుంబాలకు ఉద్యోగం, ప్రతి నెల పింఛన్, ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాల భర్తీ, 4 వేల నిరుద్యోగ భృతి, 18 ఏళ్లు నిండి చదువుతున్న యువతికి ఎలక్ట్రిక్ స్కూటీ, ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ.12లక్షల ఆర్థిక సాయం, విద్యాజ్యోతుల పథకం కింద పది పాసైన దగ్గర్నుంచే ఆర్థిక సాయం, ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణన, నిరుపేదలకు స్థలంతో పాటు రూ.5లక్షలు ఆర్థిక సాయం, కొత్త రేషన్ కార్డులు పంపిణీ, వార్డు మెంబర్లు రూ.1500 వేతనం, మాజీ సర్పంచ్‌లకు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులకు పెన్షన్, ఉద్యోగులకు సీపీఎస్, రైతులకు 24 గంటలు ఉచిత పవర్, ఆటో డ్రైవర్లకు రూ.12 వేలు సాయం, ఆడబిడ్డలకు తులం బంగారం, రూ.లక్ష సాయం, హైదరాబాద్ విజన్ 2030, జాబ్ క్యాలెండర్ ద్వారా 13 నోటిఫికేషన్లు భర్తీ వంటి అంశాలు ప్రజల మన్ననలు ఎక్కువగా పొందే చాన్స్ ఉన్నదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టేలా
గత తొమ్మిదిన్నర ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో దగాపడ్డ ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టే విధంగా ఈ మేనిఫెస్టోను రూపొదించాం. వివిధ వర్గాలు, సంఘాలు, సంస్థలు, వ్యక్తులను సంప్రదించి వారి సమస్యలను విశ్లేషించి ఓ తేజోవంతమైన సుస్థిర తెలంగాణ కోసం రూపొందించాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రతి హామీని పూర్తి చేస్తాం. ప్రజల భవిష్యత్‌ను బంగారు బాటలో నడిపిస్తాం. మేనిఫెస్టో రూపకప్పనలో ప్రత్యేక పాత్ర పోషించిన ప్రొ.అల్దాస్ జానయ్య, డాక్టర్ లింగం యాదవ్, చామల శ్రీనివాస్, తిరుమలగిరి సురేందర్, అల్లం భాస్కర్‌లకు అభినందనలు
- దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మేనిఫెస్టో కమిటీ చైర్మన్
ప్రజలకు అంకితం
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ కల. సోనియమ్మ ప్రజల ఆకాంక్షల కోసం ఇచ్చారు. కానీ కేసీఆర్ దాన్ని తన కుటుంబ ప్రయోజనాల కోసం వాడుకున్నాడు. కనీసం బీఆర్ఎస్ తన 2014, 2018 మేనిఫెస్టోలో పెట్టిన హామీలనూ అమలు చేయలేకపోయింది. నోటిఫికేషన్లలో ధోకా, నిరుద్యోగ భృతిపై మొండి చేయి, ఇలా చాలా హామీలు నీరు గారిపోయాయి. డబులు బెడ్ రూమ్‌లు బీఆర్ఎస్ కార్యకర్తలకు తప్ప ఎవరికీ రావడం లేదు. కానీ కాంగ్రెస్ మేనిఫెస్టో సబ్బండ వర్గాలకు న్యాయం చేసేలా రూపొందించాం. ఇచ్చిన మాట నిలపెట్టుకోవడమే కాంగ్రెస్ లక్ష్యం. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అన్ని హామీలు అమలు అవుతున్నాయి. కర్ణాటకలోనూ ఐదు గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇక్కడ కూడా ఆరు గ్యారంటీలతో పాటు మేనిఫెస్టోనూ పూర్తిగా ప్రజలకు చేరవేరుస్తాం.
- చామల కిరణ్ కుమార్ రెడ్డి, మీడియా కమిటీ చైర్మన్