మూసీ నిర్వాసితుల జీవనోపాధిపై ప్రభుత్వం సంచలన నిర్ణయం

by Mahesh |   ( Updated:2024-10-05 15:22:04.0  )
మూసీ నిర్వాసితుల జీవనోపాధిపై ప్రభుత్వం సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్: అసెంబ్లీ (2023 ) ఎన్నికల్లో విజయం తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే మహా నగరంలోని అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపేందుకు హైడ్రాను తీసుకొచ్చింది. అలాగే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కోసం కూడా అనేక చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ఇప్పటికే మూసీ పరివాహక ప్రాంతాల్లో సర్వే నిర్వహించి.. తొలగించాల్సిన ఇండ్లకు మార్క్ కూడా చేశారు. అయితే ఇక్కడే ప్రభుత్వానికి ప్రజలు, ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. పేద, మధ్యతరగతి ప్రజల ఇళ్లను కూలిస్తే.. రోడ్డున పడతారని నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం మూసీ నిర్వాసితుల జీవనోపాధి కోసం కీలక నిర్ణయం తీసుకుంది. మూసీ నిర్వాసితుల జీవనోపాధి కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ చైర్మన్‌గా సెర్ఫ్‌ సీఈవో దివ్య దేవరాజన్(Divya Devarajan)ను నియమించగా.. ఈ ప్రత్యేక కమిటీలో 14 మందికి చోటు కల్పించినట్లు శనివారం సాయంత్రం తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

Next Story