అగ్నిప్రమాద మృతులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం

by GSrikanth |
అగ్నిప్రమాద మృతులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం
X

దిశ, వెబ్‌డెస్క్: నాంపల్లి అగ్నిప్రమాద మృతులకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించింది. అంతకుముందు ప్రమాద స్థలాన్ని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. క్షతగాత్రులకు సరైన వైద్యం అందేలా కృషి చేస్తాం.. ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది వారికి కూడా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

Advertisement

Next Story