వైద్య శిబిరాన్ని ప్రారంభించిన గవర్నర్ తమిళిసై..

by Kalyani |
వైద్య శిబిరాన్ని ప్రారంభించిన  గవర్నర్ తమిళిసై..
X

దిశ, మేడ్చల్ టౌన్: మేడ్చల్ మండల పరిధి రాజబొల్లారం తండాలో శుక్రవారం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య శిబిరాన్ని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ గవర్నర్ కు బొకే అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. రాజబొల్లారం తండాకు చేరుకున్న గవర్నర్ ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి కొబ్బరికాయ కొట్టారు. అనంతరం అంగన్వాడీ పాఠశాలను సందర్శించి పిల్లలతో కొద్దిసేపు ముచ్చటించారు.

తండాలో గిరిజనులకు అందుతున్న వైద్యం గురించి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం రాజబొల్లారం తండాలో నిర్మించిన గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీసంత్ సద్గురు సేవాలాల్ మహారాజ్ ఆలయాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య, ఐఆర్సీఎస్ జిల్లా చైర్మన్ రాజేశ్వర్ రావు, జడ్పీ సీఈవో దేవసహాయం, డీపీవో రమణమూర్తి, సర్పంచ్ మంగ్యా నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story