Governor: గవర్నర్ కు బీఆర్ఎస్ నేతల బహిరంగ లేఖ!.. కాంగ్రెస్ సిఫార్సులను నిలివేయండి

by Ramesh Goud |
Governor: గవర్నర్ కు బీఆర్ఎస్ నేతల బహిరంగ లేఖ!.. కాంగ్రెస్ సిఫార్సులను నిలివేయండి
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం సిఫార్సు చేసిన ఎమ్మెల్సీ నియమాకాలను నిలిపివేసి, హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం తమకు న్యాయం చేయాలని తెలంగాణ గవర్నర్ కు, బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ కుమార్, కుర్ర సత్యనారయణలు బహిరంగ లేఖ రాశారు. అలాగే మరిన్ని వివరాలు తెలియజేసేందుకు గవర్నర్ వ్యక్తిగత అపాయింట్ మెంట్ ఇవ్వాలని లేఖ ద్వారా కోరారు. ఈ లేఖలో ముందుగా సామాజిక విప్లవ భూమి తెలంగాణకు గౌరవపూర్వకంగా స్వాగతం పలుకుతున్నామని అన్నారు. మీ అపార అనుభవం, గొప్ప జ్ఞానంతో తెలంగాణ అపారంగా అభివృద్ధి చెందుతుందని, అణగారిన, పేదలకు న్యాయం జరుగుతుందని, రాజ్యాంగాన్ని పరిరక్షించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తారని మాకు చాలా నమ్మకం ఉందని చెప్పారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నియామకం విషయంలో చట్టపరమైన కేసులో తాము పిటిషనర్లుగా ఉన్నామని, మీ అనుకూలమైన చర్య కోసం ఈ విషయంలో మరిన్ని వివరాలను సమర్పించాలనుకుంటున్నామని లేఖలో పేర్కొన్నారు.

ప్రొఫెసర్ కోదండరామ్ రెడ్డి మరియు అమీర్ అలీలను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించాలని కాంగ్రెస్ ప్రభుత్వం సిఫార్స్ చేసిందని, సుప్రీంకోర్టులో ఈ విషయం పరిష్కరించబడే వరకు కాంగ్రెస్ ప్రభుత్వం సిఫార్సులను నిలుపుదల చేయాలని కోరారు. ఇది రాజ్యాంగ నైతికత ప్రకారం చట్టబద్ధంగా చెల్లుబాటు అయ్యే చర్య. ఎందుకంటే సుప్రీంకోర్టులో ఉన్న కేసులో ఈ వ్యక్తులతో తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రతివాదులుగా ఉన్నారని సూచించారు. అంతేగాక హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా గత బీఆర్ఎస్ మంత్రివర్గం చేసిన సిఫార్సులను దయతో పరిశీలించి, దాసోజు మరియు కుర్ర సత్యనారయణలు ఇద్దరికీ న్యాయం చేయాలని అభ్యర్ధించారు. అలాగే మా న్యాయబద్ధమైన ఆందోళనలను వ్యక్తిగతంగా తెలియజేయడానికి, ఈ విషయంపై మరిన్ని వివరణలను అందించడానికి గవర్నర్ వ్యక్తిగత అపాయింట్‌మెంట్ ఇవ్వాలని దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారయణ కోరారు. ఈ విషయాన్ని దాసోజు శ్రవణ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్వయంగా తెలియజేశారు.

Advertisement

Next Story

Most Viewed