- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
జర్నలిస్టుల హెల్త్ కార్డులు, ఇండ్ల స్థలాలపై ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుంది: మంత్రి హరీష్ రావు
దిశ, తెలంగాణ బ్యూరో: జర్నలిస్టుల హెల్త్ కార్డులు, ఇండ్ల స్థలాల విషయంలో ప్రభుత్వం త్వరలోనే తగిన నిర్ణయం తీసుకుంటుందని రాష్ట్ర, వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఇప్పటికే హెల్త్ స్కీమ్, ఇండ్ల స్థలాలు ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయని.. అందరికీ మేలు జరిగేలా సీఎం కేసీఆర్ నిర్ణయం ఉంటుందన్నారు. హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (హెచ్ యూజే ) 2023 సంవత్సరం డైరీని మంత్రులు హరీష్ రావు , ప్రశాంత్ రెడ్డి , నిరంజన్ రెడ్డి , సబితా ఇంద్రా రెడ్డిలు గురువారం ఆవిష్కరించారు.
ఈ సందర్బంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ప్రైవేట్ హాస్పిటల్స్‌లో జర్నలిస్టుల హెల్త్ కార్డులను పూర్తి స్థాయిలో అనుమతించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఆవిష్కరణలో హెచ్ యూజే అధ్యక్షుడు అరుణ్ కుమార్, కార్యదర్శి జగదీష్, కోశాధికారి రాజశేఖర్, అధ్యక్షుడు రమేష్, జాయింట్ సెక్రటరీ క్రాంతి, టీ డబ్ల్యూ జేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చంద్రశేఖర్, ఈసీ మెంబర్ రామకృష్ణ పాల్గొన్నారు.