- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంగ్లీష్ ట్రైనింగ్ క్లాసులలో 'RRR' వీడియో చూస్తున్న ప్రభుత్వ టీచర్స్
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 2022-23 విద్యా సంవత్సరంలో అన్ని ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ క్లాసెస్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఇంగ్లీష్ ట్రైనింగ్ తరగతులు జరుపుతున్నారు. ముందుగా.. ఫస్ట్ ఫేజ్ లో 16000 మంది టీచర్లకు ఇంగ్లీష్ ట్రైనింగ్ ఇస్తున్నారు. దీనిని ది స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యూకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్(SCERT)తో పాటు అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ పర్యవేక్షణలో తరగతులు జరుగుతోంది. అయితే, ట్రైనింగ్‌లో ఇంగ్లీష్ బోధన నేర్చుకోవాల్సిన ఉపాధ్యాయులు సినిమాలు చూస్తుండటం నెట్టింట చర్చనీయాంశమైంది. ట్రైనింగ్‌కు పిలిచి సినిమాలు చూయిస్తుండటంతో విసిగిపోయిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు.. అంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. '' నారాయణపేట జిల్లాలోని దామరగిద్ద వద్ద ఉన్న ట్రైనింగ్ సెంటర్‌లో ఈరోజు కూడా ఇంగ్లీష్ ట్రైనింగ్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఆర్ఆర్ఆర్ టీజర్ వేసి చూయిస్తున్నారు'' అని ట్వీట్ చేశారు. దీంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల విద్యను అందించేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బూడిదలో పోసిన పన్నీరయ్యేలా ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై స్పందించిన సామాజికవేత్త విజయ్ గోపాల్.. మంత్రి సబితా ఇంద్రారెడ్డి, నారయణపేట కలెక్టర్‌కు ట్యాగ్ చేస్తూ రూ.50 టికెట్ పెట్టి సినిమా చూయించండి అంటూ విమర్శించారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి రావడంతో టీచర్ ట్వీట్ ను డిలీట్ చేశారు.