Tehsildars transfer : త‌హ‌శీల్దార్ల బ‌దిలీల‌కు గ్రీన్ సిగ్నల్‌

by Bhoopathi Nagaiah |
Tehsildars transfer : త‌హ‌శీల్దార్ల బ‌దిలీల‌కు గ్రీన్ సిగ్నల్‌
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా త‌హ‌శీల్దార్ల ఎన్నిక‌ల బ‌దిలీల‌కు గ్రీన్ సిగ్నల్ వ‌చ్చింది. ఎన్నిక‌ల స‌మ‌యంలో బ‌దిలీ అయిన త‌హ‌శీల్దార్లు సొంత జిల్లాల‌కు తిరిగిపోయే విధంగా అవ‌కాశం క‌ల్పిచాల‌ని తెలంగాణ త‌హ‌శీల్దార్స్ అసోసియేష‌న్(టీజీటీఏ) మొద‌టి నుంచి చేస్తున్న కృషి ఫ‌లించింది. ఇప్పటికే ఇదే విష‌య‌మై రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి, సీసీఎల్ఏ న‌వీన్ మిట్టల్ ని ప‌లు మార్లు టీజీటీఏ నేత‌లు క‌లిసి ఎన్నిక‌ల బ‌దిలీల‌పై విన‌తిప‌త్రాల‌ను అందజేశారు. ఇటీవ‌ల రెవెన్యూ మంత్రితో జ‌రిగిన ముఖాముఖీ స‌మ‌యంలోనూ ఇదే విష‌యాన్ని టీజీటీఏ బ‌లంగా చెప్పింది. ఎట్టకేల‌కు బ‌దిలీల‌కు సంబంధించిన ఐచ్ఛికాల‌ను ఇచ్చుకోవాల్సిందిగా త‌హ‌శీల్దార్లకు అవ‌కాశం ఇస్తూ సీసీఎల్ఏ ఆదేశాల‌ను జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ప‌ట్ల టీజీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌.రాములు, మహిళా అధ్యక్షురాలు పి.రాధ, ప్రధాన కార్యద‌ర్శి ర‌మేష్ పాక‌, సెక్రట‌రీ జ‌న‌ర‌ల్ పూల్‌సింగ్ చౌహాన్ రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ‌నివాస్‌రెడ్డి, సీసీఎల్ఏ నవీన్ మిట్టల్ కి ధ‌న్యవాదాలు తెలిపారు.

అంద‌రికీ అవ‌కాశం క‌ల్పించేందుకు కృషి

అర్హత‌, ఆసక్తి, అవ‌కాశం ఉన్న ప్రతి త‌హ‌శీల్దార్‌కు బ‌దిలీకి అవ‌కాశం క‌ల్పించాల‌ని టీజీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌.రాములు, ప్రధాన కార్యద‌ర్శి ర‌మేష్ పాక‌, సెక్రట‌రీ జ‌న‌ర‌ల్ పూల్‌సింగ్ చౌహాన్ కోరారు. ఎన్నిక‌ల బ‌దిలీల విష‌యంలో ఇప్పటికే కొంత జాప్యం జ‌రిగింద‌న్నారు. ఎలాంటి ష‌ర‌తులు లేకుండా ఎన్నిక‌ల స‌మ‌యంలో బ‌దిలీ అయిన ప్రతి త‌హ‌శీల్దార్‌కు సొంత జిల్లాల‌కు వెళ్లే విధంగా అవ‌కాశం క‌ల్పించాల‌న్నారు. ప్రతి ఒక త‌హ‌శీల్దార్‌కు బ‌దిలీ అవ‌కాశం క‌ల్పించేందుకు టీజీటీఏ కృషి చేస్తుంద‌న్నారు. ఎవ‌రూ కూడా ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు.

Advertisement

Next Story