BREAKING: ఐఏఎస్ ఆమ్రపాలికి తెలంగాణ సర్కార్ కీలక పదవి

by Satheesh |   ( Updated:2024-02-03 13:35:07.0  )
BREAKING: ఐఏఎస్ ఆమ్రపాలికి తెలంగాణ సర్కార్ కీలక పదవి
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు జరిగాయి. ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులకు పదవులు కేటాయించింది. ఇందులో భాగంగా ఇటీవల కేంద్ర సర్వీసుల నుండి రాష్ట్రానికి తిరిగి వచ్చిన తెలంగాణ కేడర్ ఐఏఎస్ అధికారిని కాటా ఆమ్రపాలికి ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) కమిషనర్‌గా, మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా కాటా ఆమ్రపాలిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు.

ఐఏఎస్ గోపికి అగ్రికల్చర్ డైరెక్టర్‌గా బాధ్యతలు అప్పగించింది. ఆరోగ్య శాఖ కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీగా శైలజా రామయ్యార్, టీఎస్ఎస్‌పీడీసీఎల్‌గా ముషారఫ్ ఆలీ ఫరూఖీ, ట్రాన్స్ కో, జెన్ కో చైర్మన్ అండ్ ఎండీగా రిజ్వీ, టీఎస్పీడీసీఎల్ సీఎండీగా కర్నాటీ వరుణ్ రెడ్డి, డిప్యూటీ సీఎం ఓఎస్డీగా ఐఏఎస్ కృష్ణభాస్కర్, ట్రాన్స్ కో జేఎండీగా సందీప్ కుమార్ ఝాలను నియమిస్తూ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియమకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed