- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బహిరంగ చర్చకు సిద్ధం.. కేసీఆర్ కు గవర్నర్ తమిళిసై సవాల్
దిశ, వెబ్‌డెస్క్: టీఆర్‌ఎస్ ప్రభుత్వ తీరుపై గవర్నర్ తమిళిసై మరోసారి విమర్శలు చేశారు. తాను తెలంగాణలో అధికారం చెలాయించడం లేదని, తాను స్నేహపూర్వకమైన, రాజ్యంగబద్ధమైన వ్యక్తినని వ్యాఖ్యానించారు. ప్రధానికి అంతా తెలుసని, తాను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదని స్పష్టం చేశారు. తెలంగాణలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసని, ఏ చర్యలూ తనను ఆపలేవని తెలిపారు. తాను వివాదాస్పద వ్యక్తిని కాదని, అందరితో ఫ్రెండ్లీగా ఉంటానని తమిళిసై అన్నారు. తెలంగాణ ప్రభుత్వంతోనూ సఖ్యతగా ఉండటానికి ప్రయత్నించానని, ఎలాంటి ఇగో లేదన్నారు. సీఎం కావాలనుకుంటే ఎప్పుడైనా తన ఆఫీస్ కు రావొచ్చని, ఏ విషయంపై అయినా సీఎంతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టత ఇచ్చారు.
బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నానని, రాజ్ భవన్ ను, గవర్నర్ ను అవమానించారని, అయినా తాను పట్టించుకోలేదని తమిళిసై తెలిపారు. గవర్నర్ కు ప్రభుత్వం గౌరవం ఇవ్వకపోవడాన్ని ప్రజలకే వదిలేస్తున్నానని తెలిపారు. అమిత్ షా, మోదీతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన గవర్నర్.. ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.