- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
దివ్యాంగుల గుండెల్లో ‘గూడెం’.. పంపిణీకి 208 స్కూటీలు రెడీ
శాసన సభ్యుడిగా నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తూనే మరో వైపు నిరుపేదలకు తన వంతు ఆర్థిక సాయమందించే పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి దివ్యాంగుల గుండెల్లో గూడుకట్టుకునే గొప్ప కార్యం చేపడుతున్నారు. దాదాపు రెండున్నర కోట్ల సొంత నిధులతో నియోజకవర్గంలోని నిరుపేద దివ్యాంగులకు స్కూటీలు అందించాలని నిర్ణయించారు. రూ.2.49 కోట్లతో కొనుగోలు చేసిన 208 మూడు చక్రాల హోండా యాక్టీవా వాహనాలను రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు మంగళవారం పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం పటాన్ చెరు మైత్రి మైదానంలో ఏర్పాట్లు చేశారు.
– దిశ, సంగారెడ్డి బ్యూరో
భారత రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావును స్ఫూర్తిగా తీసుకుని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మంత్రి కేటీఆర్ ’గిఫ్ట్ ఏ స్మైల్‘ కార్యక్రమాన్ని మొదలు పెట్టిన విషయం తెలిసిందే. కేటీఆర్ పిలుపు మేరకు మహిపాల్ రెడ్డి తాను ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గ పరిధిలో దివ్యాంగులై ఉండి ఇబ్బందులు పడుతున్న వారిని గుర్తించి అందరికీ మూడు చక్రాల స్కూటీలు ఇవ్వాలనుకున్నారు.
ఇందులో భాగంగానే హోండా యాక్టీవా మోడల్ వాహనాలను ప్రత్యేకంగా తయారు చేయించారు. ఒక్కో వాహనానికి రూ.1.20లక్షల వరకు మొత్తం 208 మంది కోసం 208 స్కూటీలను తెప్పించారు. ఇందుకోసం రూ.2.49 కోట్ల సొంత నిధులు వెచ్చించారు. గతంలో కూడా మహిపాల్ రెడ్డి ‘గిప్ట్ ఏ స్మైల్’లో భాగంగా 16 మంది దివ్యాంగులకు ఇలాంటి స్కూటీలే ఇప్పించిన విషయం తెలిసిందే.
నేడు మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా...
రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దివ్యాంగులకు ఈ స్కూటీలను పంపిణీ చేయనున్నారు. పటాన్ చెరు మైత్రి మైదానంలో మంగళవారం ఏర్పాటు చేసిన పంపిణీ కార్యక్రమానికి ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 4 గంటలకు నిర్వహించే ఈ కార్యక్రమానికి పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు హాజరుకాన్నారు.
మునుపెన్నడూ లేని విధంగా ఒకే రోజు 208 మంది దివ్యాంగులకు సొంత నిధులతో ఎమ్మెల్యే స్కూటీలు పంపిణీ చేయడంపై ఆసక్తి నెలకొన్నది. పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమంపై ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. పెద్ద మనుసు చాటుకుని తమకు స్కూటీలు అందిస్తున్న ఎమ్మెల్యేకు రుణపడి ఉంటామని వికలాంగులు చేతులు జోడించి కృతజ్ఞతలు చెబుతున్నారు.