Good News: తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆ రెండు రోజులు స్కూళ్లకు సెలవులు!

by Shiva |
Good News: తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆ రెండు రోజులు స్కూళ్లకు సెలవులు!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులు వరుస సెలవులతో పండుగ చేసుకోనున్నారు. శివరాత్రి (Shivratri) సందర్భంగా ఈ నెల 26న మాత్రమే సెలవు ఉందని అంతా అనుకున్నారు. కానీ, 27న కూడా ప్రభుత్వాలు ఆ రోజున సెలవు దినంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పట్టభద్రుల (Graduates), ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ (Teachers MLC's) స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. తెలంగాణ (Telangana)లో ఒక గ్రాడ్యుయేట్, రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు, ఆంధ్రప్రదే‌శ్‌ (Andhra Pradesh)లో 2 పట్టభదుల (Graduates) ఎమ్మెల్సీ స్థానాలకు, ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ (Teachers MLC's) స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 27న అంటే శివరాత్రి (Shivratri) మరుసటి రోజు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలు జరిగే జిల్లాల్లో ప్రభుత్వం పాఠశాలకు సెలవు ఇవ్వనునున్నారు. ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల పాఠశాలలకు సెలవు వర్తించనుంది.

అదేవిధంగా తెలంగాణ (Telangana)లో మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ఈ నెల 27న సెలవు ఇవ్వనున్నారు. ఈ ఎన్నికల విధుల్లో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు కూడా పాల్గొననున్నారు. ఫిబ్రవరి 3న ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ నెల 10 లోపు అభ్యర్థులు నామినేషన్లు వేయాల్సి ఉంటుంది. వచ్చిన నామినేషన్లను 11న పరిశీలిస్తారు. 13 వరకు నామినేషన్లు ఉపసంహరించుకునే అవకాశం ఇచ్చారు. పోటీలో ఉన్న అభ్యర్థులకు శివరాత్రి (Shivaratri) తర్వాత రోజున అంటే 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. మార్చి 3న కౌంటింగ్ చేపట్టి విజేతలను ప్రకటించనున్నారు.

Next Story

Most Viewed