నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 3,035 పోస్టుల భర్తీకి సర్కారు గ్రీన్ సిగ్నల్

by Rajesh |
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 3,035 పోస్టుల భర్తీకి సర్కారు గ్రీన్ సిగ్నల్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఖాళీగా ఉన్న 3,035 పోస్టుల భర్తీకి కాంగ్రెస్ సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 3,035 పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం మంగళవారం అనుమతి ఇచ్చింది. అయితే ఖాళీల భర్తీకి గత కొన్ని రోజులు ఆర్టీసీ కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆర్టీసీలో 43వేల మంది పనిచేస్తుండగా పదేళ్లుగా కొత్త నియామకాలు లేవని.. సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం మేరకు నిర్ణయం తీసుకుంటామని ఇటీవల రవాణా శాఖ మంత్రి పొన్నం తెలిపారు. కాగా ఆర్టీసీలో డ్రైవర్ పోస్టులు 2000, శ్రామిక్ 743, డిప్యూటీ సూపరింటెండెంట్ (మెకానిక్) 114, డిప్యూటీ సూపరింటెండెంట్ (ట్రాఫిక్) 84, డీఎం/ఏటీఎం/మెకానికల్ ఇంజినీర్ 40, అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్) 23, మెడికల్ ఆఫీసర్ 14, సెక్షన్ ఆఫీసర్ (సివిల్)11, అకౌంట్స్ ఆఫీసర్ 6 ఖాళీలు ఉన్నాయి. సర్కారు నియామకాల ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ తర్వలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కానుంది.

Advertisement

Next Story

Most Viewed