- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భవిష్యత్తరాలకు ఆస్తులను కాదు.. వాతావరణం ఇవ్వండి : తలసాని
X
దిశ, తెలంగాణ బ్యూరో : భవిష్యత్ తరాలకు ఇవ్వాల్సింది ఆస్తులు కాదని, ఆహ్లాదకరమైన వాతావరణం అని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం పీవీ మార్గ్‌లోని పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన నర్సరీ మేళాను ఆయన ప్రారంభించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి తీసుకొచ్చిన మొక్కలతో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సందర్శించి మొక్కలను పరిశీలించారు. పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హరితహారం అనే గొప్ప కార్యక్రమం చేపట్టి ప్రతి సంవత్సరం కోట్లాది మొక్కలను నాటుతున్న విషయాన్ని గుర్తుచేశారు. దేశంలోని వివిధ ప్రాంతాలలో లభించే అనేక రకాల మొక్కలు ఒకే చోట లభించే విధంగా గ్రాండ్ నర్సరీ మేళాను ఏర్పాటు చేయడం పట్ల నిర్వాహకులను మంత్రి అభినందించారు.
ఇవి కూడా చదవండి: కౌశిక్‌కు రాజకీయాల్లో ఓనమాలు కూడా తెలియవు : డీకే అరుణ
Advertisement
Next Story