- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మాకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి: గిగ్, ప్లాట్ ఫాం వర్కర్స్ యూనియన్
దిశ, తెలంగాణ బ్యూరో : గిగ్ వర్కర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇస్తామని చెప్పిన హామీలు అమలు చేయాలని తెలంగాణ గిగ్, ప్లాట్ ఫాం వర్కర్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. తమకు న్యాయం చేయాలని సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గిగ్, ప్లాట్ ఫాం వర్కర్ల హక్కులు, వారి సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు. 4.2 లక్షల మంది గిగ్, ప్లాట్ ఫాం కార్మికులు ఉన్నారని, వారికి పనికి తగిన వేతనం అందించేలా న్యాయం చేయాలని కోరారు. వారి సంక్షేమానికి ప్రత్యేక బోర్డుతో పాటు ఈఎస్ఐ, పీఎష్, పెన్షన్, మెటర్నిటీ సదుపాయాన్ని కల్పించాలని పేర్కొన్నారు. ప్రైవేట్ క్యాబ్ సర్వీసెస్ కు సంబంధించిన యాప్స్ కాకుండా ప్రభుత్వమే ఒక ప్రత్యేక యాప్ ను రూపొందించి అందుబాటులోకి తెస్తామని ముఖ్యమంత్రి రేవంత్ హామీ ఇచ్చారని, వీలైనంత త్వరగా ఆ యాప్ ను రూపొందించి అందుబాటులోకి తీసుకురావాలని ఆయన కోరారు.