Farooq Abdullah: ఉగ్రవాదులను చంపకూడదు.. ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

by vinod kumar |
Farooq Abdullah: ఉగ్రవాదులను చంపకూడదు.. ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: నేషనల్ కాన్ఫరెన్స్ (Nc) చీఫ్ ఫరూక్ అబ్దుల్లా (Farooq Abdullah) సంచలన వ్యాఖ్యలు చేశారు. దాడులకు పాల్పడిన ఉగ్రవాదులను(Terrarists) చంపకూడదని, వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తే వారి వెనుక ఎవరున్నారో స్పష్టంగా తెలుసుకోవచ్చని తెలిపారు. సూత్రధారులను వెలికి తీయాలంటే ఉగ్రవాదులను హతమార్చడం కంటే పట్టుకోవడమే మేలని సూచించారు. దాడులకు పాల్పడే విలువైన నెట్‌వర్క్‌లను కూడా గుర్తించొచ్చని అభిప్రాయపడ్డారు. శనివారం ఆయన శ్రీనగర్‌(Srinagar)లో మీడియాతో మాట్లాడారు. బుద్గామ్ ఉగ్రదాడిపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. జమ్మూ కశ్మీర్‌లో ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తులే ఈ పని చేశారా? అనే సందేహం కలుగుతోందన్నారు. ఉగ్రదాడిపై విచారణ జరపాల్సిందేనని, ప్రభుత్వం ఏర్పడిన కొద్ది కాలంలోనే ఇలా ఎందుకు జరుగుతోందని ప్రశ్నించారు. ఒమర్ అబ్దుల్లా(Omar Abdhullah)ను అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తున్నారని, వారి వెనుక ఏ సంస్థ ఉందో తెలుసుకోవాలన్నారు. కాబట్టి ఉగ్రవాదులను పట్టుకుంటేనే అన్ని విషయాలు బయటపడతాయని నొక్కి చెప్పారు.

ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యలపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ శరద్ చంద్ర పవార్ (Ncp sp) చీఫ్ శరద్ పవార్ స్పందించారు. ఫరూక్ వ్యాఖ్యలను సమర్థించారు. ఈ సమస్యను తీవ్రంగా పరిగణించాలని కేంద్ర ప్రభుత్వం, హోం మంత్రిత్వ శాఖకు విజ్ఞప్తి చేశారు. విషయాన్ని సీరియస్‌గా తీసుకుని, పరిస్థితిని పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. అలాగే బీజేపీ జమ్మూ కశ్మీర్ అధ్యక్షుడు రవీందర్ రైనా కూడా స్పందిస్తూ.. ఈ ప్రాంతంలో ఉగ్రవాదానికి మూలం ఏంటో అందరికీ తెలిసని, ఇందులో పరిశోధించడానికి ఏమీలేదని తెలిపారు. జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడుల్లో పాకిస్థాన్, ఉగ్రవాద సంస్థల ప్రమేయం ఉంటుందని, సైన్యం, భద్రతా బలగాలకు ప్రతి ఒక్కరూ మద్దతివ్వాలని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed