Tiruchanur : తిరుచానూరు పద్మావతి అమ్మవారికి బంగారు హారం కానుక

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-11-16 10:06:46.0  )
Tiruchanur : తిరుచానూరు పద్మావతి అమ్మవారికి బంగారు హారం కానుక
X

దిశ, వెబ్ డెస్క్ : టీటీడీ మాజీ చైర్మన్ ఆదికేశవులు నాయుడు కుమార్తె తేజస్విని తిరుచానూరు(Tiruchanur)పద్మావతి అమ్మవారికి బంగారు హారాన్ని కానుక(Gift of gold necklace)గా అందజేశారు. ప్రత్యేక పూజల అనంతరం ఆలయ ప్రధాన అర్చకులకు ఆమె ఈ హారాన్ని అందజేశారు. తాజాగా కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకన్నకు తేజస్వి, మనవరాలు చైతన్య విలువైన కానుకను అందజేశారు.

దాదాపు 2 కోట్ల రూపాయల విలువైన వజ్ర వైడుర్యాలు పొదిగిన స్వర్ణ వైజయంతీ మాలను శ్రీవారికి సమర్పించారు ఈ వైజయంతీ మాలను ఉత్సవ మూర్తికి అలంకరణకు వినియోగించనున్నారు. ఇంతవరకు స్వామి వారికి వైజయంతి మాల లేదు. తిరుమల శ్రీవారికి మాత్రమే కాదు.. తిరుచానూరు పద్మావతి అమ్మవారికి కూడా మరో వైజయంతీ మాలను వారు సమర్పించారు. శృంగేరి పీఠాధిపతి ద్వారా వజ్రాలతో కూడిన నాలుగు హారాలను కూడా వారు స్వామి వారికి బహూకరించారు

Advertisement

Next Story

Most Viewed