- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్ లోకి గీతారెడ్డి!.. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల వెనుక మర్మం అదేనా?
దిశ, డైనమిక్ బ్యూరో:ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన మాజీ మంత్రి జె.గీతారెడ్డి షార్ట్ బ్రేక్ తర్వాత మళ్లీ పాలిటిక్స్ లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారా?అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నప్పటికీ త్వరలోనే ఆమెకు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ప్రయార్టీ దక్కబోతున్నదా? తాజాగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. గీతారెడ్డి తల్లి ఈశ్వరీబాయి 33వ వర్ధంతి వేడుగలు శనివారం రవీంద్ర భారతీలో తెలంగాణ భాషా సాస్కృతిక శాఖ, ఈశ్వరీ బాయి మెమోరియల్ ట్రస్ట్ ఆద్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు జూపల్లి, పొంగులేటి, పొన్నం తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గీతారెడ్డి తనకు అక్కలాంటిదని గీతక్క లాంటి వారి మంత్రిగా లేకపోవడం ఒక లోటు అన్నారు. రాజీవ్ గాంధీ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చారని వారు వివిధ హోదాల్లో స్థాయిలో పని చేసారని గీతారెడ్డికి పార్టీ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగానే కాకుండా గీతక్క సోదరుడిగా వారి కుటుంబానికి ఏ అవకాశం ఉన్నా, ఏ సందర్భం ఉన్నా పార్టీ అండగా నిలుస్తుందన్నారు.
నామినేటెడ్ పోస్ట్?:
ఒకప్పుడు కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ గా పేరున్న గీతారెడ్డి ప్రస్తుతం పాలిటిక్స్ కు దూరంగా ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాలకు సైతం అటెండ్ కావడం లేదు. ఈ క్రమంలో ఆమె మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్ లోకి రాబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి సూచనలతో ఆమె తిరిగి క్రియాశీలక రాజకీయాల్లోకి రాబోతున్నారా అనే చర్చ జరుగుతోంది. ఆమె తిరిగి యాక్టివ్ అయితే ఆమెకు మహిళా కమిషన్ చైర్ పర్సన్ లేదా మరేదైనా నామినేటెడ్ పోస్ట్ కేటాయించబోతున్నట్లు ప్రాచారం జరుగుతోంది. కాగా గతంలో మంత్రిగా గజ్వేల్, జహీరాబాద్ నియోజకవర్గాలకు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన గీతారెడ్డి 2014లో జహిరాబాద్ నియోజకవర్గం నుంచి చివరిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2018లో ఓటమిపాలయ్యారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె పోటీకి దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో గీతారెడ్డికి నామినేటెడ్ పోస్ట్ దక్కబోతున్నా అనే చర్చ జోరుగా వినిపిస్తోంది.