- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ganta: అధికారులపై దాడి సరికాదు.. టీజీపీఎస్సీ మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణి
దిశ, వెబ్ డెస్క్: ప్రభుత్వ అధికారుల మీద దాడి(Attack On Government Officials) ఎంతమాత్రం సమర్థనీయం కాదని(Not Justified) మాజీ టీజీపీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి(TGPSC Chairman Ghanta Chakrapani) అన్నారు. లగచర్ల ఘటన(Lagacharla Incident)పై ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా.. ప్రభుత్వఅధికారులపై దాడి చేయడం సరికాదని అన్నారు. అలాగే అధికారులు కూడా ప్రజలకు పాలకులు తప్ప పెట్టుబడిదారుల ఏజెంట్లు కాదనే విషయం గుర్తుంచి మెలగాలని సూచించారు.
వికారాబాద్ జిల్లా(Vikarabad District) లగచర్ల సంఘటనలో కుట్ర ఉందని అధికారులు చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తుందని, ఒక వేళ కుట్ర(Conspiracy) నిజమే అయితే అది పేదరైతుల భూములు కాజేసే కుట్ర మాత్రమే తప్ప ప్రభుత్వం మీద రైతులు చేసిన కుట్ర కాదని వ్యాఖ్యానించారు. అంతేగాక భూముల సేకరణ చట్టపరిధిలో ప్రజల సమ్మతితో జరగాలి తప్ప ప్రజలను నిర్బంధించి, భయపెట్టి కాదని తెలిపారు. అది ప్రజా ప్రయోజనం కోసమైతే వేరేసంగతి. కానీ ప్రైవేటు వ్యక్తుల కోసం అయినప్పుడు నిరాకరించే హక్కు ఉంటుందని చెప్పారు. ఇక తమ జీవనాధారమైన భూములను ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వబోము అని చెప్పే అధికారం రైతులకు ఉంటుందని, గ్రామాలను దిగ్బంధం చేసి, అరెస్ట్ చేసి అక్కడ కంపెనీలు పెట్టలేరు.. నడపలేరని ఘంటా చక్రపాణి స్పష్టం చేశారు.