పర్యాటకులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే సోమశిల టూ శ్రీశైలం లాంచీ ప్రయాణం

by Jakkula Mamatha |   ( Updated:2024-10-25 11:00:15.0  )
పర్యాటకులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే సోమశిల టూ శ్రీశైలం లాంచీ ప్రయాణం
X

దిశ,వెబ్‌డెస్క్:పర్యాటకులకు తెలంగాణ టూరిజం(Telangana Tourism) గుడ్ న్యూస్ చెప్పింది. నల్లమల అటవీ ప్రాంత అందాలను చూసేలా లాంచీ ప్రయాణానికి పర్యాటక శాఖ(Department of Tourism) శ్రీకారం చుట్టింది. శ్రీశైలం డ్యాం బ్యాక్‌వాటర్‌లో చేపట్టనున్న ఈ టూర్‌ ఆహ్లాదకరంగా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఈనెల 26 నుంచి నాగర్ కర్నూల్ జిల్లా(Nagar Kurnool District) సోమశిల నుంచి శ్రీశైలం(Somashila to Srisailam) వరకు లాంచీ సేవలను అందుబాటులోకి తేనుంది. కొల్హాపూర్ మండలం సోమశిల తీరంలో 120 మంది ప్రయాణించేలా ఏసీ లాంచీని అధికారులు ఏర్పాటు చేశారు. నల్లమల అందాలను తిలకిస్తూ ఏడు గంటల పాటు ప్రయాణం ఉంటుంది. టికెట్ ధర పెద్దలకు రూ.2వేలు, పిల్లలకు రూ.1600గా నిర్ణయించారు. రౌండప్‌ జర్నీ(Roundup Journey)లో పెద్ద వాళ్లకు రూ.3 వేలు, పిల్లలకు రూ.2,400గా ధరను నిర్ణయించారు. ఈ ప్యాకేజీలో లాంచీ ప్రయాణంతోపాటు టీ, స్నాక్స్‌ అందించనున్నట్టు చెప్పారు. సింగిల్‌ జర్నీ(Single Journey)కి నాలుగు నుంచి ఆరు గంటల సమయం పట్టనున్నది.

Advertisement

Next Story