కాంగ్రెస్‌కు.. కామ్రేడ్లకు కుదిరిన దోస్తీ.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్

by Ramesh N |
కాంగ్రెస్‌కు.. కామ్రేడ్లకు కుదిరిన దోస్తీ.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే లోక్‌సభ ఎన్నికల్లో కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఇటీవల కామ్రేడ్లతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఇందుకు సీపీఐ, సీపీఎం పార్టీలు సానుకూలంగానే ఉన్నాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు. తాజాగా భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ సందర్భంగా కార్నర్ మీటింగ్‌లో పాల్గొన్న వీడియోను సీఎం రేవంత్ పోస్ట్ చేశారు.

‘భువనగిరి పాదాల వద్ద.. గగనమంత ఎత్తున ఎగసి అభిమాన కెరటాలు. త్యాగాల స్థూపాల సాక్షిగా.. సాగిన జైత్రయాత్ర ఇది. కాంగ్రెస్ కు.. కామ్రేడ్లకు కుదిరిన దోస్తీ.. కంచుకోటపై ఎగురుతుంది గెలుపు జెండా’ అని సీఎం పేర్కొన్నారు. కాగా, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని ఇటీవల ప్రకటనలో తాము పోటీలో లేని చోట తప్పకుండా కాంగ్రెస్‌కు మద్దతు ఉంటుందని అన్నారు.

Advertisement

Next Story