- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫ్రీడమ్ ఈస్ నాట్ గివెన్.. ఇట్స్ టేకెన్.. కేటీఆర్ ఆసక్తికర ట్వీట్
దిశ, డైనమిక్ బ్యూరో: ఉద్యమ సమయంలో నడిమధ్యలో పారిపోయిన ఉత్తుత్తి ఉద్యమకారులు ఎందరో ఉన్న పట్టుదలతో నిబద్దతతో ప్రయాణం చేసి గమ్యాన్ని ముద్దాడిన ఒకే ఒక్కడు కేసీఆర్! అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఫ్రీడమ్ ఈస్ నాట్ గివెన్.. ఇట్స్ టేకెన్ అని నేతాజీ సుభాష్ చంద్ర బోస్ చెప్పిన కోట్ తో ట్వీట్ చేసిన ఆయన కేంద్రాన్ని దారికి తెస్తాం తెలంగాణా సాధిస్తాం అని ఉద్యమ సమయంలో కేసీఆర్ చెప్పినట్లు ఉన్న పేపర్ క్లిప్పింగ్ ను పోస్ట్ చేశారు.
దీనిపై 2001లోనే, తొట్ట తొలి సభలోనే ..ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ సాధిస్తామని ప్రకటించాలంటే ఎంత ధైర్యం కావాలని, ఉద్యమబాట వీడితే రాళ్లతో కొట్టి చంపండి అని పిలుపునివ్వాలంటే.. పుట్టిన మట్టిపై ఎంత ప్రేమ వుండాలి అని తెలిపారు. అసాధ్యం అనుకునే ఒక స్వప్నాన్ని.. సుసాధ్యం చేసి చూపిస్తాం అని చెప్పిన మాట ఉక్కు సంకల్పానికి నిదర్శనమని అన్నారు. నడి మధ్యలో కాడి పారేసి పారిపోయిన ఉత్తుత్తి ఉద్యమకారులు, నకిలీ నాయకులు ఎందరో ఉన్నా.. పట్టుదలతో, నిబద్ధతతో ప్రయాణం చేసి గమ్యాన్ని ముద్దాడిన ఒకే ఒక్కడు కేసీఆర్ అని కేటీఆర్ స్పష్టం చేశారు.