- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పోలీసుల అదుపులో నలుగురు బీఆర్ఎస్ నేతలు?
దిశ, కరీంనగర్ బ్యూరో: భూకబ్జాల ఆరోపణలు కేసులతో అతాలకుతలమై కుదేలైనా బీఆర్ఎస్ పార్టీని నేటికీ భూకబ్జా కేసులు వెంటాడుతూనే ఉన్నాయి. అధికారం అడ్డుపెట్టుకుని అక్రమాలే అవదిగా సాగిన తోమ్మదిన్నర ఏళ్ల కాలంలో చేసిన అక్రమాలు, అరాచకాలు ఒక్కొక్కటిగా బీఆర్ఎస్ నేతలకు మెడకు చుట్టుకుంటున్నాయి. ఆ కేసుల పరంపర ప్రభుత్వం మారి పదకొండు నెలలు గడసినా కొనసాగుతూనే ఉన్నాయి. రోజుకొక్కటి చొప్పున అక్రమాలు వెలుగు చూస్తూ బీఆర్ఎస్ నేతలను ఊచల్లోకి నెట్టేస్తున్నాయి.
తాజాగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని విద్యానగర్ పార్క్ స్థలం కబ్జా ఆరోపణలపై కరీంనగర్ టాస్క్ పోర్స్ పోలీసులు నలుగురు బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ కబ్జా కేసులో నిందితులు మాజీ మంత్రి అనుచరులు కావడం సదరు భూ కబ్జాలో అధికారులను మాజీ మంత్రి తప్పుదోవ పట్టించే విధంగా ఆదేశించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు మాజీ మంత్రి ప్రమేయంపై లోతుగా విచారణ చేపట్టినట్టు తెలుస్తోంది. అయితే అదుపులోకి తీసుకున్న నలుగురు బీఆర్ఎస్ నేతల అరెస్టుకు రంగం సిద్ధం చేసినట్టు సమాచారం.