- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నోరు విప్పుతున్న ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు.. కొందరు బీఆర్ఎస్ నేతల పేర్లు వెల్లడి!
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన వివరాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో అరెస్టయిన సస్పెండైన డీఎస్పీ ప్రణీత్‌రావు రెండో రోజు విచారణలో కొంతమంది బీఆర్ఎస్నాయకుల పేర్లను వెల్లడించినట్టు సమాచారం. దాంతోపాటు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు మరికొందరు నాయకుల ఫోన్లను ట్యాప్ చేసిన విషయాన్ని అంగీకరించినట్టు తెలిసింది. దీంట్లో అన్ని పార్టీలకు చెందిన నాయకులు ఉన్నట్టుగా ప్రణీత్‌రావు చెప్పినట్టుగా తెలియవచ్చింది. దాంతోపాటు పలువురు వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక వేత్తల ఫోన్లను కూడా ట్యాప్చేసినట్టుగా వెల్లడించినట్టు సమాచారం.
ఇక, ప్రణీత్‌రావు ఇంట్లో నుంచి స్వాధీనం చేసుకున్న డైరీ నుంచి కూడా దర్యాప్తు అధికారులకు కీలకమైన సమాచారం తెలిసినట్టుగా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలియవచ్చింది. ఫోన్ట్యాపింగ్కేసులో ప్రధాన నిందితునిగా ఉన్న సస్పెండెడ్డీఎస్పీ ప్రణీత్‌రావును ప్రత్యేక విచారణ బృందం కోర్టు అనుమతితో వారం రోజులపాటు కస్టడీకి తీసుకుని విచారిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రెండో రోజైన సోమవారం జూబ్లీహిల్స్ఏసీపీ వెంకటగిరి నేతృత్వంలోని ప్రత్యేక బృందం ప్రణీత్‌రావును బంజారాహిల్స్పోలీస్స్టేషన్కు తరలించి ఏడు గంటలకు పైగా ప్రశ్నించింది.
రెండో రోజు జరిగిన ఈ విచారణలో ప్రణీత్‌రావు బీఆర్ఎస్పార్టీలోని కొంతమంది కీలక నేతల పేర్లను వెల్లడించినట్టుగా తెలిసింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్‌ఎస్‌నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు సూచనల మేరకు పాలకుర్తి నియోజకవర్గంలో వార్‌రూం ఏర్పాటు చేసి మరీ ప్రణీత్‌రావు వేర్వేరు పార్టీలకు చెందిన నాయకులతోపాటు వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక వేత్తల ఫోన్లను ట్యాప్చేయించినట్టుగా ఇప్పటికే దర్యాప్తులో వెల్లడైన విషయం తెలిసిందే. మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా వార్‌రూంలు ఏర్పాటు చేసినట్టుగా అనుమానాలు ఉన్న నేపథ్యంలో సోమవారం జరిగిన విచారణలో ప్రత్యేక బృందం ఈ అంశం పైనే ఎక్కువగా ప్రశ్నించినట్టుగా సమాచారం.
మొదట సమాధానాలు చెప్పటానికి ఇష్టపడని ప్రణీత్‌రావు ఆ తరువాత కొన్ని ప్రశ్నలకు జవాబులు ఇచ్చినట్టుగా తెలిసింది. ఈ క్రమంలోనే ఆయన కొందరు బీఆర్ఎస్నాయకుల పేర్లను వెల్లడించినట్టుగా తెలియవచ్చింది. దాంతోపాటు ఫోన్లు ట్యాపింగ్చేయాలని తనకు సూచించిన కొందరు అధికారుల పేర్లను కూడా ప్రణీత్‌రావు చెప్పినట్టుగా సమాచారం ఇక, ప్రణీత్‌రావు నివాసం నుంచి స్వాధీనం చేసుకున్న డైరీలో పలు కీలక అంశాలు ఉన్నట్టుగా తెలియవచ్చింది. దీంట్లో కాంగ్రెస్, బీజేపీతోపాటు బీఆర్ఎస్పార్టీకి చెందిన పలువురి పేర్లు, ఫోన్‌నెంబర్లు ఉన్నట్టు సమాచారం. పదుల సంఖ్యలో ప్రైవేట్వ్యక్తుల ఫోన్‌నెంబర్లు కూడా ఉన్నట్టుగా తెలిసింది. దీనిపై ప్రత్యేక విచారణ బృందం ప్రణీత్‌రావును నిశితంగా ప్రశ్నించినట్టుగా సమాచారం.
ఆ ఆరుగురిని కూడా..
ఇక, ఎస్ఐబీలో ఉన్న సమయంలో ప్రణీత్‌రావు తన టీం కోసం ప్రత్యేకంగా రెండు గదులను కేటాయించుకుని 17 కంప్యూటర్లు సమకూర్చుకుని ఫోన్లను ట్యాప్చేసినట్టుగా ఇప్పటికే విచారణలో స్పష్టమైన విషయం తెలిసిందే. కాగా, ఈ ఆఫీస్‌లో ఆరుగురు అధికారులు నిరంతరం పని చేసినట్టుగా ప్రత్యేక విచారణ బృందం గుర్తించింది. ఈ నేపథ్యంలో గుర్తించిన ఆరుగురు అధికారులను ఒక్కొక్కరిగా ఆ తరువాత అందరినీ ఒకే చోట కూర్చోబెట్టి విచారించాలని అధికారులు నిర్ణయించినట్టుగా తెలియవచ్చింది. ఇదిలా ఉండగా ధ్వంసం చేసిన 17 కంప్యూటర్లలోని సమాచారాన్ని ప్రణీత్‌రావు తన వ్యక్తిగత పెన్‌డ్రైవ్‌లలో అప్లోడ్చేసుకున్నట్టుగా విచారణ బృందం గుర్తించినట్టు సమాచారం. ఈ క్రమంలో పెన్‌డ్రైవ్‌లు ఎక్కడ ఉన్నాయన్న దానిపై కూడా ఆరా తీసినట్టుగా తెలిసింది. ఇక, సోమవారం ప్రణీత్‌రావును వెంటబెట్టుకుని ఎస్ఐబీ కార్యాలయానికి వెళ్లిన దర్యాప్తు అధికారులు సీన్రీ కన్స్ర్టక్షన్చేసినట్టుగా తెలియవచ్చింది.