- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాజీ ప్రధాని పీవీకి భారతరత్న ఇవ్వాలి: మాజీ మంత్రి KTR డిమాండ్
దిశ, వెబ్‌డెస్క్: భారత మాజీ ప్రధాని పీవీ నర్సింహా రావుకు భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. పీవీని విస్మరించి కాంగ్రెస్ చేసిన అన్యాయం ఏదైతే ఉందో దాన్ని సరిదిద్దాలని.. కేంద్రాన్ని కోరుతున్నానని అన్నారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని తాము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏదైతే డిమాండ్ చేశామో.. ఇప్పుడు కూడా అదే అడుగుతున్నామన్నారు. పీవీ నర్సింహరావుకు సముచిత స్థానం కల్పించాలని కోరారు. శనివారం పీవీ నరసింహా రావు 19వ వర్ధంతి సందర్భంగా కేటీఆర్ నివాళులర్పించారు. ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్‌తో కలిసి అప్పుల్లో కూరుకుపోయిన భారతదేశాన్ని గాడిన పెట్టీ పీవీ తన వంతు దేశానికి సేవలు అందించారని గుర్తు చేశారు. తెలుగు వారికి, తెలంగాణ వారికి, భారతదేశానికి వన్నె తెచ్చిన నేత పీవీ నర్సింహ రావు అని కొనియాడారు. ఆయన ఆదర్శాలకు అనుగుణంగా పనిచేయాలని కోరారు. ఢిల్లీలో పీవీ ఘాట్ నిర్మించాలని డిమాండ్ చేశారు.