కేసీఆర్ క్రెడిబులిటీ కోల్పోయారు.. మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్

by Javid Pasha |   ( Updated:2023-02-13 13:35:38.0  )
కేసీఆర్ క్రెడిబులిటీ కోల్పోయారు.. మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి కేసీఆర్ రోజురోజుకూ తన క్రెడిబులిటీని కోల్పోతున్నారని, తన మాటలతో ప్రజల విశ్వాసం కోల్పోయారని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ విమర్శలు చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాటలు నిర్వేదంతో నిండి ఉన్నాయని ఆయన సెటైర్లు వేశారు. ఆయన స్పీచ్ లో తడబడుతున్నాడని చురకలంటించారు. ఆయన స్పీచ్ లో చాలెంజ్ కనిపించడంలేదని ఓన్లీ సబ్మిషన్ మాత్రమే కనిపిస్తోందని ఎద్దేవాచేశారు. కాంగ్రెస్ ను మచ్చిక చేసుకుంటున్నట్టు, ఈటలకు స్నేహం హస్తం అందిస్తున్నట్లు ఆయన స్పీచ్ సాగిందన్నారు.

ముఖ్యమంత్రి బడ్జెట్ కు ఎలాంటి లెక్కలు, ఎక్కాలు లేవని విమర్శలు చేశారు. బీసీలకు బడ్జెట్ లో కేటాయించింది సున్నా అని మండిపడ్డారు. అంతిమ విజయం ప్రజలది కావాలని కేసీఆర్ పలుమార్లు ప్రస్తావించారని, కానీ తెలంగాణలో అంతిమ విజయం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు దక్కలేదని, కేవలం నలుగురు కల్వకుంట్ల కుటుంబసభ్యులకు మాత్రమే దక్కిందని పేర్రకొన్నారు. ఈ అంశంపై కేసీఆర్ పబ్లిక్ పోల్ కి సిద్ధమా అని బూర నర్సయ్య గౌడ్ సవాల్ విసిరారు. సీఎం నోటి నుంచి ఏ దేశం పేరు వస్తే ఆ దేశం మటాష్ అని తెలిపారు.

కేసీఆర్ కు దమ్ముంటే రాజకీయంగా ఫైట్ చేయాలని, అంతేకానీ దేశాన్ని కించపరచకూడదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. విదేశీ కుట్రలో భాగం కావొద్దని సూచించారు. మేకిన్ ఇండియా.. జోకిన్ ఇండియా కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. మిల్క్ ప్రొడక్షన్ లో ఇండియా నంబర్ వన్ గా నిలిచిందని, ఫోన్ల ఉత్పత్తి ఇప్పుడు ఇండియాలోనే జరుగుతోందని, ప్రపంచంలో రెండోస్థానంలో ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ఆటోమొబైల్ ఇండస్ట్రీ, కార్లు ఇక్కడ తయారై ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్న పరిస్థితికి తీసుకొచ్చిన ఘనత మోడీకి దక్కిందన్నారు.

👉 Download our Android App
👉Download our IOS App
👉Follow us on Instagram
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed