ప్రజలు ఓట్లేస్తేనే హీరోలు.. KTR ఈ విషయం గుర్తు పెట్టుకో: మాజీ MP బూర ఫైర్

by Satheesh |
ప్రజలు ఓట్లేస్తేనే హీరోలు.. KTR ఈ విషయం గుర్తు పెట్టుకో: మాజీ MP బూర ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్ పొలిటికల్ విజయ్ మాల్యాలాగా తయారయ్యారని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ విమర్శలు చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రి కేటీఆర్ కేంద్రంపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నాడని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికారం ఒక్కరికే సొంత కాదని, అన్ని రోజులు బీఆర్ఎస్ సర్కారే అధికారంలో ఉండదని ఆయన చురకలంటించారు. మంత్రి కేటీఆర్ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సూచించారు. ప్రజలు ఓట్లేస్తే హీరోలని, లేదంటే జీరోలే అని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామో లేదో.. అనే అభద్రతా భావంలో బీఆర్ఎస్ నేతలున్నారని, తమ ఉనికికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని భయపడుతున్నారని బూర వ్యాఖ్యానించారు. అందుకే రాత్రికి రాత్రి జీవోలు తెచ్చి భూములు కూడా కబ్జా చేస్తున్నారని ఆరోపిఇంచారు.

ఔరంగాబాద్ సభకు భారీగా యాడ్స్ ఇచ్చారని, అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు ప్రజల సొమ్మును పంచుతున్నారని విమర్శలు చేశారు. రాయల తెలంగాణ అని ఒక ఏపీ నేత కొత్త రాగం ఎత్తుకున్నారని, ఏపీలో ఓట్లు పొందాలని కేసీఆర్ చేస్తున్న మోసంలాగా ఇది ఉందని ఆయన అనుమానం వ్యక్తంచేశారు. తెలంగాణ తల్లికి మోసం చేసిన కేసీఆర్.. ఇప్పుడు తెలుగు తల్లికి మోసం చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ నిర్వహించేది ఆత్మీయ సమ్మేళనాలు కాదని, ఆత్మ వంచన సభలని ఆయన చెప్పారు. దేశంలోనే ఐటీ రంగంలో తెలంగాణ టాప్ అని మంత్రి కేటీఆర్ గొప్పలు చెప్పారని, అవన్నీ అబద్ధమన్నారు. కర్ణాటక ఫస్ట్ ప్లేస్‌లో ఉంటే తెలంగాణ మూడో స్థానంలో ఉందని, రెండో స్థానం నుంచి మూడో స్థానానికి పడిపోయిందన్నారు.

Advertisement

Next Story

Most Viewed