High Court : మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు పోలీసుల విచారణకు హాజరు కావాల్సిందే : హైకోర్టు

by Y. Venkata Narasimha Reddy |
High Court : మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు పోలీసుల విచారణకు హాజరు కావాల్సిందే : హైకోర్టు
X

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్(Former MLA Shakeel) కొడుకు సాహెల్(Son Sahel) పోలీసుల విచారణ(police Inquiry)కు హాజరు కావాల్సిందేనని హైకోర్టు(High Court)స్పష్టం చేసింది. ఈ నెల 16 న పంజాగుట్ట పోలీసుల ముందు షకీల్ కొడుకు సాహెల్ హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. షకీల్ కొడుకు సాహెల్ పై ప్రజా భవన్ గేట్స్ ను రాష్ డ్రైవింగ్ తో ఢీ కొట్టాడని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. కేసు నమోదు అయినా తర్వాత సాహెల్ దుబాయ్ పారిపోయాడు. ప్రస్తుతం దుబాయ్ లో ఉన్న సాహెల్ హైదరాబాద్ రావాల్సిందేనని, పోలీసుల విచారణకు హాజరుకావాల్సిందేనని హైకోర్టు ఆదేశించింది.

ప్రజాభవన్ గేట్లను ఢీకొన్న కారు కేసులో సాహెల్ ను తప్పించి డ్రైవర్ అసిఫ్ ను నిందితుడిగా చేర్చేందుకు పంజాగుట్ట సీఐ దుర్గారావు చేసిన ప్రయత్నం బయటపడగా, ఉన్నతాధికారులు అతడిని సస్పెండ్ చేయడంతో పాటు కేసు కూడా నమోదు చేశారు. ఇందులో బోధన్ ఇన్ స్పెక్టర్ ప్రేమ్ కుమార్ ను, అబ్ధులా వాహేద్ ను కూడా నిందితులుగా చేర్చగా నిందితుల సంఖ్య ఎనిమిదికి చేరింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సాహెల్ దుబాయ్ పారిపోయేందుకు సహకరించిన అసిఫ్, అర్షద్, సోహెల్ లను అరెస్టు చేసి రిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే షకీల్, సాహెల్ కోసం పోలీసులు ఇప్పటికే లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.

Advertisement

Next Story