Phone Tapping Case: నోటీసులపై స్పందించిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

by Gantepaka Srikanth |
Phone Tapping Case: నోటీసులపై స్పందించిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
X

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య(Chirumarthi Lingaiah)కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్టై జైలులో ఉన్న తిరుపతన్న(Thirupathanna)తో ఫోన్ కాంటాక్ట్స్‌లో ఉండటంతో విచారణకు రావాలని ఆదేశించారు. ఇవాళే జూబ్లీహిల్స్‌లోని ఏసీపీ ఆఫీస్‌లో విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. తాజాగా నోటీసుల(Police Notices)పై చిరుమర్తి లింగయ్య స్పందించారు. విచారణకు హాజరయ్యేందుకు సమయం కావాలని పోలీసులను కోరారు.

అనారోగ్యం కారణంగా ఇవాళ విచారణకు హాజరు కాలేనని అన్నారు. ఈ నెల 14వ తేదీన హాజరయ్యేందుకు అవకాశం ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారని జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి(Jubilee Hills ACP Venkatagiri) స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితులతో చిరుమర్తి లింగయ్యకు సంబంధాలున్నట్లు ఆధారాలు ఉన్నాయని ఏసీపీ తెలిపారు. లింగయ్య విచారణ ఆధారంగా మరికొందరు నేతలను విచారిస్తామని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed