- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
'దున్నపోతు మీద వాన పడ్డట్లుగా ప్రభుత్వ వైఖరి!'
దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ వ్యవహారం లో ప్రభుత్వ వైఖరి దున్నపోతు మీద వాన పడినట్లు ఉందన్నారు. గురువారం హైదరాబాద్ గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన కామారెడ్డి రైతులు ఆందోళన చేస్తుంటే కలెక్టర్ కనీసం స్పందించకపోవడం దారుణం అన్నారు. రైతుల భూములతో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూస్తోందని, రైతుల భూములు తీసుకుని గ్రీన్ జొన్ పెడతారా అని ప్రశ్నించారు. రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నా ప్రభుత్వానికి పట్టింపు లేదన్నారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ మాస్టర్ ప్లాన్ ను వ్యతిరేకిస్తూ మరణించిన రైతు కుటుంబానికి ప్రభుత్వం రూ.25 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమస్యలు ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వం చాక్లెట్ ఇస్తోందని అదే కాంగ్రెస్ పార్టీ పర్మినెంట్ సొల్యూషన్ ఇస్తుందని చెప్పారు. మైనార్టీలకు కేసీఆర్ ప్రభుత్వం చేసిందేమి లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన రిజర్వేషన్లతో 1500 మంది మైనార్టీలు డాక్టర్లు అయ్యారని అన్నారు. 12 శాతం రిజర్వేషన్లు ఇస్తానని కేసీఆర్ చెప్పారని ఈ హామీ ఏమైందని ప్రశ్నించారు. ఫీజు రియంబర్స్ మెంట్ ఇవ్వకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులకు ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని అన్నారు.