- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం అభ్యర్థిని నిర్ణయించే అధికారం రేవంత్ రెడ్డికి లేదు.. టీపీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య
దిశ, వెబ్ డెస్క్: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఎం అభ్యర్థిని నిర్ణయించే అధికారం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి లేదని అన్నారు. సీఎం అభ్యర్థి విషయంలో అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీతక్క కూడా సీఎం కావొచ్చని రేవంత్ మీడియా ప్రశ్నకు సమాధానంగా చెప్పారే తప్ప ఎక్కడా తాను సీతక్కను సీఎం చేస్తానని అనలేదని స్పష్టం చేశారు. అనవసరంగా దీన్ని రాద్దాంతం చేశారని అన్నారు. తాను నియోజవర్గానికి దూరమయ్యానంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కానీ తాను ఎప్పుడూ తన నియోజకవర్గ ప్రజలకు అందుబాటులోనే ఉన్నానని అన్నారు.
ప్రపంచంలోనే మొదటిసారి ఉచిత విద్యుత్ అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీదని అన్నారు. తాము హమీ ఇచ్చినట్లు ఏడు గంటల ఉచిత విద్యుత్ ను అందించామని తెలిపారు. కాంగ్రెస్ లో బీసీలకు టికెట్లు ఇచ్చినా గెలవటం లేదనే విషయంలో ఎలాంటి నిజం లేదని అన్నారు. సీఎం కేసీఆర్ కు తనకంటే రాజకీయంగా తక్కువ అనుభవం ఉందని, రాష్ట్రంలో తాను తిరిగినన్ని గ్రామాలను కేసీఆర్ తిరగలేదని అన్నారు. ఇలా ఎన్నో విషయాలను మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ‘దిశ టీవీ’తో పంచుకున్నారు. ఆ విషయాలు తెలియాలంటే కింది వీడియోను మొత్తం చూడండి.